జూనియర్ కి పార్టీ కీలక బాద్యతలు లోకేష్ ఏమన్నారో చూడండి

64

ఏపీ రాజకీయాలలో ఎప్పటికప్పుడు సమీకరణాలు ఊహించని విధంగా మారుతాయనేది అందరికి తెలిసిందే. ఎప్పుడు ఎవరు ఎవరితో కలుస్తారో ఊహించడం చాలా కష్టం. ఈ కారణంగా రాజకీయ సమీకరనాలని ఎవరు అంచనా వేయలేరు..ఈ సమయంలో ఇద్దరు ముఖ్య వ్యక్తుల భేటీ రాజకీయంగా పెను ఆలోచనలకు కారణం అయింది.. ఈ ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్.. తెలుగు దేశం పార్టీ తరుపున ఎలాంటి ప్రచారం నిర్వహించలేదు. అంతకు ముందు తెలంగాణ ఎన్నికల్లో సొంత అక్క సుహాసిని పోటీ చేసినా.. ప్రచారానికి దూరంగా ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో జూనియర్ మామ నార్నే శ్రీనివాసరావు వైసీపీలో జాయిన్ అయిన సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా తెలుగు దేశం పార్టీకి దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఏపీలో చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ కేవలం 23 సీట్లకే పరిమితం అయింది. ఆ తర్వాత జూనియర్, చంద్రబాబు నాయుడు కలిసింది లేదు.

Image result for chandra babu and jr ntr

తాజాగా జరిగిన ఎన్నికలలో తెలుగు ఓటర్లు ఊహించని ఫలితాలు ఇచ్చారు తెలుగుదేశం పార్టీకి. అలాగే వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఊహించని వారు మంత్రులుగా తెరపైకి వచ్చారు. ఇవన్ని పక్కన పెడితే ఇప్పుడు ఏపీ రాజకీయాలలో తెలుగు దేశం పార్టీ చుట్టూ రాజకీయ ఊహాగానాలు మొదలయ్యాయి. చంద్రబాబు తర్వాత పార్టీని సమర్దవంతంగా నడిపించే నాయకుడు కోసం ఆ పార్టీ క్యాడర్ ఎదురుచూస్తుంది. చంద్రబాబు తన కుమారుడు లోకేష్ కి బాద్యతలు అప్పగించాలని ప్రయత్నం చేస్తున్నా అతను నాయకుడుగా తన సామర్ధ్యం నిరూపించుకోలేకపోతున్నాడు. అతని అసమర్ధత కారణంగా పార్టీని వీడుతున్న వారు కూడా ఉన్నారు.

Image result for chandra babu and jr ntr

పార్టీ ఇలా ప్రతిపక్షంలో ఉండంటంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. తెలంగాణలో దాదాపు ఖాళీ అయ్యే పరిస్థితి ఏర్పడింది. తెలుగువాడి ఆత్మగౌరవం అనే పునాదుల మీద నిర్మితమైన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు తెలంగాణలో మనుగడ కోసం కష్టపడుతోంది. ఆవిర్భావం నుంచీ టీడీపీలో ఉంటూ వచ్చిన గరికపాటి రామ్మోహన్ రావు, నామా నాగేశ్వరరావు, రేవంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు వంటి నాయకులు పార్టీని ఫిరాయించారు. తెలంగాణలో లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయలేని దుస్థితికి చేరుకుంది టీడీపీ. అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్, భారతీయ జనతాపార్టీ తీర్థాన్ని పుచ్చుకున్నారు. తెలంగాణ టీడీపీ నుంచి కొనసాగుతోన్న వలసలకు ఇప్పట్లో ఆగేలా లేవు. ఇక లోకేష్ చంద్రబాబు కూడా పార్టీని మరో ఐదు సంవత్సరాలు ప్రతిపక్షం నుంచి నడపాల్సిన పరిస్దితికి వచ్చింది.

ఈ క్రింద వీడియో చూడండి

ఈ నేపధ్యంలో చాలా రోజులుగా తెలుగు దేశం పార్టీ పగ్గాలు జూనియర్ ఎన్టీఆర్ కి ఇవ్వాలనే మాట తెలుగు దేశం పార్టీ వర్గాలలో వినిపిస్తుంది. అయితే చాలా కాలంగా ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీ వ్యవహారాలలో తలదూర్చకుండా రాజకీయాలకి దూరంగా ఉంటున్నాడు. ఇదిలా ఉంటె తాజాగా హరికృష్ణ మొదటి వర్ధంతి సందర్భంగా చంద్రబాబు జూనియర్ ఎన్టీఆర్ కి కలుసుకున్నారు.ఈ సందర్భంగా బాబు, కళ్యాణ్ రామ్ తో పాటు ఎన్టీఆర్ తో కూడా ఏకాంతంగా చర్చించినట్లు తెలుస్తుంది. ఈ నేపధ్యంలో చంద్రబాబు మరల జూనియర్ ని పార్టీలోకి ఆహ్వానించి కీలక బాద్యతలు అప్పగించే ఆలోచన చేస్తున్నారని టాక్ రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది.అయితే లోకేష్ కూడా పార్టీ బాధ్యతలు ఎన్టీఆర్ కు ఇచ్చినా పర్వాలేదు అన్నారట మా అందరి తాత అయిన ఎన్టీఆర్ పెట్టిన పార్టీ అందరం కలిసి పనిచేస్తామని సొంత పార్టీ నేతలతో లోకేష్ అన్నారట.