జలీల్ కు షాక్ ఇచ్చిన సొంత పార్టీ నేతలు

234

తన కుమార్తెకు టికెట్ ఇచ్చిన సీఎం చంద్రబాబుకి ధన్యవాదాలు చెప్పి, ఆ ఆనందంలో తన కుమార్తెకు ఫస్ట్ టికెట్ చంద్రబాబు ఇచ్చారు అని చెప్పారు జలీల్ ఖాన్, ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీలో పెను దుమారం కలిగించాయి. ఇక ఎంపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ వ్యాఖ్యలు తాజాగా జలీల్ ఖాన్ వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీ అధినాయకత్వానికి వ్యక్తిగత ప్రకటనలు తలనొప్పిగా మారుతున్నాయి. టీడీపీ ఎంపీ టీజీ వెంకటేష్ చేసిన వ్యాఖ్యలు మరువకముందే తెరపైకి జలీల్ఖాన్ వ్యాఖ్యలు పార్టీలో కలకలం రేపుతున్నాయి.

Image result for జలీల్

ఇటీవల టీడీపీలో చేరిన తన కుమార్తెకు విజయవాడ పశ్చిమ సీటును ఇచ్చారంటూ.. జలీల్ఖాన్ ప్రకటించడంపై స్థానిక నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరికి వారే సీట్లు ప్రకటించుకోవడం ఏంటంటూ.. జలీల్ఖాన్పై చంద్రబాబుకు నాగుల్ మీరా ఫిర్యాదు చేశారు. అయితే దీనిపై చంద్రబాబు ఇప్పటికే జలీల్ కు ఈ విషయం పై క్లారిటీ ఇచ్చారట.