జనసేనలోకి నాగబాబు అన్నకు ఎంపీ సీటు

159

ఆనాడు ప్రజారాజ్యం పార్టీలో పోటీ చేయాలి అని అనుకున్నా, ఆయనకు కోరిక నెరవేరలేదు.. ఆయనే మెగా బ్రదర్ నాగబాబు.. ఇప్పుడు తమ్ముడు పెట్టిన పార్టీ జనసేనలో ఆయన కోరిక తీరనుంది అని తెలుస్తోంది.. ఆయన జనసేనలో చేరాలి అని అనుకుంటున్నారు.. ముఖ్యంగా జనసేనలో ఆయనకు పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు.. తమ్ముడికి ఆయన వెన్నంటి ఉన్నారు. ఈ సమయంలో ఆయన జనసేనలో చేరితే రాజకీయంగా ఉపయుక్తం అవుతుంది అని భావించారు ఆయన.

Image result for jenasena join naga babu
 ఈరోజు విజయవాడలో పవన్ కల్యాణ్ సమక్షంలో పార్టీలో చేరనున్నారు.. ఆయనకు పవన్ నరసాపురం నుంచి ఎంపీ టికెట్ ఇస్తున్నారు అని తెలుస్తోంది.. ఇక్కడ టఫ్ వార్ ఉంది అనేది తెలిసిందే, ఇక భీమవరం నుంచి పవన్ కల్యాణ్ అసెంబ్లీకి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.. మొత్తానికి సోదరులు ఇద్దరూ సొంత సెగ్మెంట్లకు దగ్గర్లోనే పోటికి నిలవడం పెద్ద ఎత్తున చర్చకు వస్తున్న అంశం.