జగన్ బాబాయ్ ఓటు తీసింది ఎవరంటే ?

232

ఇప్పుడు ఐటి గ్రిడ్స్ వివాదం ఏపీలో కాక రాజేసింది… ఓ పక్క తెలంగాణలో టీఆర్ఎస్ నాయకులు తెలుగుదేశం నాయకులు మరో పక్క తెలుగుదేశం వైసీపీ నాయకుల మధ్య వివాదాలు విమర్శలు బౌండరీలు దాటుతున్నాయి.వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి నీచమైన రాజకీయాలు చేస్తున్నారని టీడీపీ నేత సతీష్రెడ్డి విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వివేకానందరెడ్డి ఓటును తొలగించింది జగనేనని ఆరోపించారు.

Related image

వైసీపీ నాయకులు కొందరి ఓట్లను కావాలనే తొలగించుకున్నారని ,వివేకా ఓటు తొలగించి జగన్ లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆయన విమర్శించారు. జగన్కు ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి ఓటు వేస్తారనే నమ్మకం లేదు కాబట్టే తొలగించారన్నారు. అది వారు గుర్తించాలి అని విమర్శించారు ఆయన.ఫారం 7 ద్వారా ప్రజల ఓట్లు తొలగించమని చెప్పడానికి జగన్ ఎవరని ప్రశ్నించారు. జగన్ వ్యాఖ్యలను ఎన్నికల సంఘం సుమోటోగా స్వీకరించాలని సతీష్రెడ్డి కోరారు. సో ఈ ఎన్నికల సమయంలో ఈ హాట్ హాట్ కామెంట్లు తీవ్ర చర్చలకు దారితీస్తున్నాయి.