జగన్ పార్టీలోకి ప్రముఖ వ్యాపారవేత్త..!

569

వైసిపి అధినేత ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు అనూహ్య స్పందన లభిస్తోంది..ఈ నేఅప్ధ్యంలో సినీ ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు, వ్యాపార వేత్తలు ఆయన పార్టీ పట్ల ఆకర్షితులవుతున్నారు..సినీ ప్రముఖులు పోసాని, పృద్వీలు ఇప్పటికే పార్టీలో చేరగా, తాజాగా ప్రముఖ జ్యుయలరీ సంస్థ లలితా జ్యుయలర్స్ చైర్మన్ కిరణ్ కుమార్ కూడా జగన్ కు జై కొట్టారు..త్వరలోనే కిరణ్ …వైసీపీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం తూర్పు గోదావరి జిల్లాలో జగన్ ను కలిసిన కిరణ్ కుమార్ ను ఆయన వైసీపీలోకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఈ ఆహ్వానంపై కిరణ్ యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దాదాపుగా కిరణ్ వైసీపీలో చేరతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

లలితా జ్యూవెర్స్ కు దేశవ్యాప్తంగా బ్రాంచిలున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి రాజస్థాన్ కు చెందిన కిరణ్ 1980లలో నెల్లూరులో జ్యూవెలరీ డిజైనర్ గా తన కెరీర్ ను మొదలుపెట్టారు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి….ఈ స్థాయికి ఎదిగారు. ప్రస్తుతం చెన్నైలో ఉంటోన్న కిరణ్ కు నెల్లూరుతో అనుబంధం ఉంది. నెల్లూరులో కిరణ్ పలు సేవాకార్యక్రమాలను చేపట్టారు. తెలుగులో చక్కగా మాట్లాడగలిగిన కిరణ్ …కు ఆంధ్రప్రదేశ్ లో కూడా మంచి పాపులారిటీ ఉంది. ప్రస్తుతం కిరణ్ టర్నోవర్ 15 వేల కోట్ల రూపాయలుంటుందని అంచనా. 2020 నాటికి 50 వేల కోట్ల టర్నోవర్ లక్ష్యంగా కిరణ్ తన వ్యాపారసామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నారు. ఇటువంటి బడా వ్యాపారి వైసీపీలో చేరితే….ఆ పార్టీకి అదనపు బలం చేకూరుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే వైసీపీలో చేరడంపై కిరణ్ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. మరి భవిష్యత్తులో కిరణ్ రాజకీయ అరంగేట్రం చేస్తారో …లేదో అన్నది తెలియాలంటే మరి కొంత కాలం వేచి చూడక తప్పదు.