జగన్ ను ఒంటరిగా ఎదుర్కొనే దమ్ము సత్తా బాబుకు ఉందా..!

501

ప్రస్తుతం జగన్ చేస్తున్న మహా సంకల్ప పాదయాత్రకు ప్రజలు తండోప తండాలుగా వస్తున్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల నిర్వహణ రాజకీయ వ్యూహాల ముందు ఆయన తట్టుకోలేరని మాజీ ఎంపి, రాజకీయ విశ్లేషకుడు ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యానించారు.. గత ఎన్నికల్లో కూడా వైసీపీ గెలుస్తుందని ప్రచారం చేశారని, కానీ లెక్కలు తేలేసరికి టీడీపీ ఆధిక్యత సాధించిందని ఆయన అన్నారు.

ఈ రాతలు రాసిన పత్రిక అనుబంధ చానల్‌లో చంద్రబాబును ఒంటరిగా ఎదుర్కొనే సత్తా జగన్‌కు లేదు అని ఉండవల్లి చెప్పిన మాటలపై ఎస్‌ఎంఎస్‌ పోల్‌ నిర్వహించగా కాదు అనేవాళ్లు ఎక్కువ శాతం ఉండటం గమనార్హం. అంటే చంద్రబాబును ఒంటరిగా ఎదుర్కొనే సత్తా జగన్‌కు ఉందని ఎక్కువ మంది ప్రజలు విశ్వసిస్తున్నారన్న మాట. 2014 ఎన్నికల్లో తాము చంద్రబాబుకు మద్దతు ఇవ్వకుంటే జగన్‌ ముఖ్యమంత్రి అయ్యేవారని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌, బీజేపీ నేతలు వేర్వేరు సందర్భాల్లో పదేపదే అంటున్న మాటలివి.

ఇటీవల పవన్‌కల్యాణ్‌ జనసేన కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ 2012లో తాను చంద్రబాబును కలిసినప్పుడు పార్టీ పెట్టి దాదాపు 70 స్థానాల్లో పోటీ చేయాలనుకుంటున్నానని తన మనసులో మాట చెప్పానని, అయితే ఓట్లు చీలి జగన్‌ లాభపడుతారని ఆయన వారించారన్నారు. అందువల్లే తాను గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చానని పవన్‌ అసలు విషయాన్ని వెల్లడించారు. ఒకవైపు మోడీ హవా, పవన్‌కల్యాణ్‌ చరిష్మా కలసి చంద్రబాబును అధికారంలోకి తెచ్చాయి. ఇది నిజం. ఆ ఎన్నికల్లో జగన్‌ ఒంటరిగా పోటీచేసి కేవలం రెండుశాతం ఓట్ల తేడాతో అధికారానికి దూరమయ్యారు.

2014 ఎన్నికల్లో చంద్రబాబు మోడీ పవన్ కూటమికి ఎల్లో మీడియా మద్దతు వారి గెలుపుకు దోహదం చేసింది..జగన్ ను అధికారం నుండి దూరం చేసిందే కాని ప్రజల ఆదరాభిమానాలను దూరం చేయలేకపోయింది..ఈ సారి 2019 ఎన్నికలకు అన్ని పార్టీలు సన్నద్దమవుతున్నాయి… జగన్‌ ఎప్పట్లానే కదనోత్సాహంతో ముందుకు సాగుతున్నారు. ప్రత్యేకహోదా కోసం నాలుగేళ్లుగా అహర్నిషలు పోరాటం చేస్తూనే ఉన్నారు. ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు, వారితో మమేకమయ్యేందుకు రెట్టించిన ఉత్సాహంతో మహాసంకల్పయాత్ర చేపట్టారు.

ఇప్పుడు ఒక్క మీడియా తప్ప మిగతా ఏ తోడూ లేక చంద్రబాబు ఒంటరయ్యారు. జగన్‌ను ఎదుర్కొనేందుకు ఆయన నానా ఇబ్బందులు పడుతున్నారు. వ్యూహాలు రచించడంలో చంద్రబాబు దిట్టేకావచ్చే. ఎన్నికల మేనేజ్‌మెంట్‌లో బాబు సిద్ధహస్తుడే కావచ్చు. అన్నిటికి మించి ఓటుకు వెలకట్టడంలో ఆరితేరారనేది వాస్తవం కావచ్చు. కాని ఉండవల్లి చెప్పినట్టు ప్రజాభిమానాన్ని చూరగొనడంలో జగన్‌కు చంద్రబాబు సాటిరారు. అదే జగన్‌ను గెలిపిస్తుంది. అపార వైఎస్సార్‌ అభిమానులున్న జగన్‌ ఒంటరి ఎలా అవుతారు. అసలు జగన్‌ను ఒంటరిగా ఎదుర్కొనే సత్తా చంద్రబాబుకు ఉందా అనేది తేలాల్సి ఉంది.