జగన్ కేడర్ కు కీలక ఆదేశం

194

ఎన్నికలకు సమయం దగ్గర పడటంతో రాజకీయంగా పెద్ద పెద్ద నాయకులు కూడా సీట్ల కోసం ఇటు నుంచి అటు పార్టీలు జంప్ అవుతున్నారు . ఈ సమయంలో ఓట్ల మిస్సింగ్ అనే అంశం ఏపీలో పెను దుమారం లేపింది. ఇక తెలుగుదేశం పార్టీకి వైసీపికి పెద్ద యుద్దం జరుగుతోంది అని చెప్పాలి ఈ ఎన్నికల్లో ఓట్ల అంశం. అయితే ఈ సమయంలో వైసీపీ అధినేత జగన్ మరో కీలక పిలుపు తన కేడర్ కు ఇచ్చారు సో అది ఇప్పుడు చూద్దాం.

Image result for jagan

వైఎస్సార్సీపీ బూత్ లెవల్ క్యాడర్ అందరకీ.. మనం నాలుగేళ్లుగా ప్రతి అంశంలో కష్టపడ్డాం. ఈ చివరి యత్నంలో ఉత్తమ ప్రయత్నాల కోసం పోరాడేందుకు ప్రతి ఒక్క వైఎస్సార్సీపీ కార్యకర్త సిద్దంగా ఉండాలి. వచ్చే రెండు రోజుల్లో ప్రతి ఓటును తనిఖీ చేయండి. పోలింగ్ రోజు ప్రతి ఒక్కరు ఓటేసేలా చూడాలి. వచ్చే 27 రోజుల్లో మీ నుంచి మద్దతును మరింత కోరుతున్నా’ అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటరుగా పేరు నమోదు చేసుకోవడానికి రేపటి(శుక్రవారం)తో గడువు ముగుస్తుండటంతో పార్టీ క్యాడర్ను వైఎస్ జగన్ అలర్ట్ చేశారు.