జగన్ కు మద్దతుగా యనమల వ్యాఖ్యలు…షాక్ లో చంద్రబాబు..

742

కాపు రిజర్వేషన్ల అంశంపై జగన్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని లేపాయి..అమలుకు సాధ్యం కాని హామీలను ఇవ్వలేను అని జగన్ చేసిన వ్యాఖ్యలను తెలుగుదేశం అనుకూల మీడియా తమకు అనుకూలంగా మలిచి వక్రీకరించింది..జగన్ కాపు రిజర్వేషన్లకు వ్యతిరేకమనే ముద్ర వేయగలిగింది..కాపు రిజర్వేషన్లపై జగన్ వ్యఖరి గురించి మాట్లాడడం అప్రస్తుతం..గత ఎన్నికల్లో కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని ఎన్నికల హామీలు గుప్పించిన చంద్రబాబు నాలుగు సంవత్సరాలు దాటినా ఒక కొలిక్కి తీసుకురాలేకపోయారంటే అది బాబు చేతకాని తనమే అని చెప్పుకోవాలి..ఇప్పుడు కాపు రిజర్వేషన్ల అంశం రాష్ట్రం పరిధి దాటి కేంద్రం పరిధి లోకి వెళ్ళిపోయింది..

తాజాగా, కాపు రిజర్వేషన్లపై టీడీపీనేత.. ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చేయగలిగిందేమీ లేదు. ఏం చేయాలన్నా కేంద్రమే చేయాలి. కేంద్రం, రాజ్యాంగాన్ని మార్చాలి.. రాజ్యాంగాన్ని మార్చితే, కాపు రిజర్వేషన్లు సాధ్యమే..’ అని సెలవిచ్చారు యనమల రామకృష్ణుడు. రిజర్వేషన్ల అంశం, కేంద్ర పరిధిలో వుందని తెలిసీ, చంద్రబాబు 2014 ఎన్నికల్లో కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కల్పిస్తామని ఎలా ‘ఉత్త’హామీ ఇచ్చేశారట.?

తూర్పుగోదావరి జిల్లాలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహిస్తోన్న ప్రజాసంకల్ప యాత్రను అడ్డుకునేందుకు ‘కాపు రిజర్వేషన్ల’ వ్యవహారానికి మరింత మషాలా దట్టించి మరీ, తెలుగుదేశం పార్టీ నానా యాగీ చేస్తోన్న ఈ సమయంలో అదే తూర్పుగోదావరి జిల్లాకి చెందిన మంత్రి యనమల రామకృష్ణుడు.. ‘కాపు రిజర్వేషన్ల అంశం రాష్ట్ర పరిధిలోనిది కాదు..’ అని వ్యాఖ్యానించడంతో అంతా షాక్‌ అవ్వాల్సి వస్తోంది. యనమల వ్యాఖ్యలతో, ఒక్కసారిగా వైఎస్సార్సీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కన్పిస్తోంది. కాపు రిజర్వేషన్ల విషయంలో టీడీపీ వైఖరేంటో యనమల వ్యాఖ్యల్లోనే స్పష్టమవుతోందని అంటున్నారు వైఎస్సార్సీపీ నేతలు. ఇందులో నిజం లేకపోలేదు కూడా. నిజానికి, హామీలిచ్చి పిల్లిమొగ్గలేయడం టీడీపీకి కొత్తకాదు. చంద్రబాబు అంటేనే, మాటతప్పడం.. మడమ తిప్పడం వంటివాటికి బ్రాండ్‌ అంబాసిడర్‌. ఆ విషయం కాపు రిజర్వేషన్ల వ్యవహారంలోనూ మరోమారు స్పష్టమయ్యిందంతే.