జగన్ కు దాసోహం అంటున్న టీడీపీ మంత్రి కూతురు వద్దంటున్న చంద్రబాబు లోకేష్

456

అధికారం ఎవరికి శాశ్వతం కాదు, అలాగే ఎవరికి దూరం కాదు, ఇప్పుడు అధికారం ఉండచ్చు తర్వాత ఉండకపోవచ్చు, ఏపీలో జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నారు, కాని ఇప్పుడు అధికారంలోకి వచ్చారు…. ఏపీలో ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ సునామీ ముందు మ‌హామ‌హులైన మంత్రులే కొట్టుకుపోయారు. పార్టీ అధినేత చంద్ర‌బాబు త‌న‌యుడు, మంత్రిగా ఉన్న లోకేషే గెల‌వ‌ని ప‌రిస్థితి. ఇక ఈ ప్ర‌భంజనంలో అచ్చెన్నాయుడు, నిమ్మ‌కాయ‌ల చిన‌రాజ‌ప్ప లాంటి వాళ్లు మాత్ర‌మే గెలిచారు. ఇక టీడీపీ హ‌యాంలో ఐదేళ్ల పాటు ఓ రేంజ్‌లో హ‌వా న‌డిపించారు. రాజ‌ధాని భూముల వ్య‌వ‌హారం నుంచి అంతా తానే అయ్యి న‌డిపించారు. ఆయ‌న‌పై తీవ్ర‌మైన ఆరోప‌ణ‌లు కూడా వ‌చ్చాయి. చంద్ర‌బాబు విదేశాల‌కు వెళ్లిన‌ప్పుడు కూడా ఆయ‌న లేకుండా వెళ్లేవారు కాదు. అలాంటి నేత ఎన్నిక‌ల్లో ఓడిపోయారు. ఆ త‌ర్వాత ఆయ‌న పూర్తిగా సైలెంట్ అయిపోయారు. ఎన్నిక‌ల్లో ఆయ‌న ఓటిమికి సొంత పార్టీ నేత‌లు కూడా కృషి చేశారు. ఇక ఇప్పుడు ఆ మాజీ మంత్రి గారు త‌న వందల కోట్ల రూపాయల విలువైన వ్యాపారాలను మాత్రం చూసుకుంటున్నారు. ఆ మాజీ మంత్రి టీడీపీకి కొన్ని సంవ‌త్స‌రాల పాటు ఫైనాన్షియ‌ర్‌గా ఉన్నారు.

Image result for jagan

అందుకే ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌క‌పోయినా ఆయ‌న‌కు బాబు మంత్రి ప‌ద‌వి క‌ట్ట‌బెట్టేశారు. ఇక ఇప్పుడు ఆయ‌న వ్యాపారాలు అన్ని ఆయ‌న కుమార్తె చూసుకుంటున్నార‌ట‌. ఇప్పుడు ఆయ‌న వ్యాపారాలు పెద్ద ప్ర‌మాదంలో ఉన్నాయ‌ని తెలుస్తోంది. దీంతో స‌ద‌రు మాజీ మంత్రి కూతురు ఈ లేనిపోని రాజ‌కీయ త‌ల‌నొప్పులు మ‌న‌కెందుకు ? మ‌న వ్యాపారాలు బాగుంటే చాలు అని ఇటీవ‌ల ఆమెను ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి దంప‌తుల‌ను సీక్రెట్‌గా క‌లిసిన‌ట్టు తెలుస్తోంది.

ఈ క్రింద వీడియో చూడండి

టీడీపీ హ‌యాంలో త‌మ తండ్రి ఎంతో చేశార‌ని… భారీగా చేతి చ‌మురు వ‌దిలించుకున్నా త‌మ‌కు జ‌రిగిన న‌ష్ట‌మే ఎక్కువ‌ని చెప్పుకుని వాపోయింద‌ట‌. ఇప్పుడు తాము క్రియాశీల‌క రాజ‌కీయాల్లో ఉండ‌మ‌ని… కేవ‌లం వ్యాపారాలు మాత్ర‌మే చూసుకుంటామ‌ని కూడా చెప్పిన‌ట్టు టాక్‌. ఆమె అస‌లు ఉద్దేశం ఏంటంటే మేం రాజ‌కీయాల్లో ఉండం.. మా వ్యాపారాల‌కు ఎలాంటి ఇబ్బందులు క‌లిగించ‌వ‌చ్చ‌ని వేడుకునేందుకే ఆమె జ‌గ‌న్ దంప‌తుల‌ను క‌లిసింద‌న్న గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. పోని జగన్ వదిలినా మిగిలిన నేతలు కూడా టార్గెట్ చేసే ఆలోచనలో ఉన్నారట. సదరు మంత్రిగారు ఇప్పుడు తెలుగుదేశం కాంపౌండ్ లోకి పార్టీ ఆఫీసుకి కూడా వెళ్లడం లేదు.. ఒకవేళ వెళితే ఆయన పరిస్దితి ఏమిటి అనే డైలమాలో ఉన్నారట, ఇంత‌కు ఆ మాజీ మంత్రి కూతురు ఎవ‌రో ఈ పాటికే మీకు అర్థ‌మై ఉంటుంద‌నుకుంట‌… రాజకీయాల్లో ఇవన్నీ కామన్ అని కొందరు విశ్లేషకులు కొట్టిపారేస్తున్నారు, మరి మీరేమంటారు మీ అభిప్రాయం కామెంట్ల రూపంలో తెలియచేయండి.