జగన్ ఇంటి ముందు అతిపెద్ద పోరాటానికి కీలక నాయకుడు సిద్దం షాక్ లో జగన్

49

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ‘కన్నా లక్ష్మీనారాయణ’ అధికార వైకాపాపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తడంపై రకరకాలైన విశ్లేషణలు వినిపిస్తున్నాయి. వైకాపా ప్రభుత్వంపై ఆయన చేస్తోన్న విమర్శలు, ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఎన్నడూ లేని విధంగా నేరుగా వైకాపా అధినేత వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి టార్గెట్‌గా చేసుకుని విమర్శలు చేస్తోండడంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నిన్న మొన్నటి దాకా..ఆయన వైకాపాకు సానుభూతిపరుడు. ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి తండ్రి వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి మంత్రివర్గంలో ‘కన్నా’ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. వై.ఎస్‌. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ‘కన్నా’కు కీలకమైన మంత్రి పదవులు లభించాయి. దాంతోపాటు గుంటూరు జిల్లాలో మంత్రిగా ఆయన తిరుగులేని విధంగా చక్రం తిప్పారు. వై.ఎస్‌ అనుంగు శిష్యుల్లో ‘కన్నా’ ఒకరుగా పేరు తెచ్చుకున్నారు. వై.ఎస్‌ మరణించిన తరువాత ‘కన్నా’ కాంగ్రెస్‌లోఉన్నా ‘జగన్‌’ను మాత్రం నోరు తెరిచి ఒక్క మాట కూడా అనలేదు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటమి చెందడంతో..బిజెపిలో చేరిన ఆయన తరువాత వైకాపాలో చేరాలని మూహర్తం నిర్ణయించుకోవడం ఆఖరి నిమిషంలో బిజెపి పెద్దల జోక్యంతో..ఆగిపోయింది. తరువాత జరిగిన ఎన్నికల్లో వైకాపా ఘన విజయం సాధించిన విషయం విదితమే. వైకాపాలో చేరాలనుకుని ఆగిపోయిన ‘కన్నా’కు బిజెపి పెద్దలు రాష్ట్ర బిజెపి అధ్యక్ష పదవి కట్టబెట్టారు. దీంతో..రాష్ట్ర బిజెపి అధ్యక్షుడుగా ఆయన ప్రభుత్వం దండెత్తుతున్నారు.

Image result for jagan house

వాస్తవానికి వై.ఎస్‌.జగన్‌కు మద్దతుదారుగా ఉండే లక్ష్మీనారాయణ ఇప్పుడు ఆయనపై దండెత్తుతుండడం, ప్రతి రోజూ విమర్శలు గుప్పించడం, ధర్నాలు, రాస్తారోకోలు చేస్తామని చెబుతుండడంపై రాజకీయ పరిశీలకుల్లో ఆశ్చర్యం వ్యక్తం అవుతోంది. ఎందుకు ‘కన్నా’ ఈ విధంగా వైకాపాపై దండెత్తుతున్నారు…? బిజెపికి చెందిన పాతతరం నాయకులు సోము వీర్రాజు, హరిబాబు వంటి నేతలు వైకాపా ప్రభుత్వంపై ఎటువంటి విమర్శలు చేయడం లేదు. వారు కాకుండా గతంలో కీలకంగా వ్యవహరించిన నేతలెవరూ దూకుడుగా ముందుకు వెళ్లడం లేదు. ఒక్క ‘కన్నా’ మాత్రమే వైకాపా ప్రభుత్వంపై ప్రతి రోజూ విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తూ మీడియాలో దూకుడుగా కనిపిస్తున్నారు. ‘జగన్‌’ ప్రభుత్వం అన్నింటా విఫలమైందని, ఆయనకు ఆరు నెలలు సమయం ఇద్దామని చూశామని, కానీ..ఆయన ప్రభుత్వం ప్రజలను వేధిస్తోందని ‘కన్నా’ ఆరోపిస్తున్నారు. ఆయన ఎందుకు ఇంత దూకుడుగా వెళుతున్నారనే దానిపై పలు రకాలైన విశ్లేషణలు వస్తున్నాయి.

ఈ క్రింద వీడియో చూడండి

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా ‘కన్నా లక్ష్మీనారాయణ’ విఫలమయ్యారని, ఆయనను పదవి నుంచి తొలగిస్తారనే వార్తలు వస్తోన్న నేపథ్యంలో ఆయన దూకుడుగా వెళుతున్నారని స్వంత పార్టీకే చెందిన నాయకులు చెబుతున్నారు. మళ్లీ అధ్యక్ష పదవి పొందాలంటే ఈ విధంగా ముందుకెళితేనే సాధ్యమనే భావన ఆయనలో ఉందని వారు అంటుంటగా…మరి కొందరు మాత్రం బిజెపి పెద్దలు ఆయనకు అక్షింతలు వేశారని, అందుకే దూకుడును ప్రదర్శిస్తున్నారంటున్నారు. మరి కొందరు మాత్రం ఇటీవల తెలుగుదేశం పార్టీ నుంచి బిజెపిలో చేరిన ‘సుజనాచౌదరి’ వంటి వారితో ముప్పును గ్రహించి ముందు జాగ్రత్తగా ‘కన్నా’ వైకాపా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారంటున్నారు. బిజెపి అధ్యక్ష పదవిని ‘సుజనాచౌదరి’కి ఇస్తారని వార్తలు వస్తూండడం, బిజెపి పెద్దలు ‘సుజనా, సిఎం రమేష్‌’లకు ప్రాధాన్యత ఇస్తోండడంతో..రేసులో తాను వెనుకబడిపోతున్నాననే భయంతోనే ‘కన్నా’ ‘జగన్‌’ ప్రభుత్వంపై దూకుడుగా విమర్శలు,ఆరోపణలు చేస్తున్నారంటున్నారు. మొత్తం మీద..ఉన్న పదవి కాపాడుకోవడం, భవిష్యత్‌ అవకాశాలకు అడ్డంకులు రాకుండా చూసుకోవడం కోసమే ఒకప్పుడు తాను మద్దతు ఇచ్చిన ‘జగన్‌’పై ‘కన్నా’ దూకుడుగా వెళుతున్నారని, దీనిలోని లోగుట్టు ఇదేనని మరి కొందరు చెబుతున్నారు.