జంగా కృష్ణామూర్తికి వైసీపీ ఎమ్మెల్సీ అవకాశం

258

ఎమ్మెల్యే కోటాలో శాసనమండలి అభ్యర్థిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆ పార్టీ బీసీ సంఘం అధ్యయన కమిటీ ఛైర్మన్ జంగా కృష్ణామూర్తి బీ ఫారం అందుకున్నారు. ముఖ్యంగా జగన్ ఇక్కడ లేకపోయినా పార్టీ తరపున రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి గురువారం జంగా కృష్ణమూర్తికి బీ ఫారం అందచేశారు… ఈ నెల 25న ఆయన అమరావతిలో నామినేషన్ దాఖలు చేయనున్నారు… మరోవైపు శాసనమండలి ఎన్నికలకు ఇవాళ నోటిఫికేషన్ విడుదలైంది… ఇక జంగా కృష్ణమూర్తికి పార్టీ తరపున అవకాశం ఇవ్వడం పై ఆనందం వ్యక్తం చేశారు పార్టీ నాయకులు, పార్టీలో ఎవరికి అయినా కష్టపడితే అవకాశం వస్తుంది అని చెప్పారు పార్టీ నేతలు.