చిక్కుల్లో వైఎస్ జగన్ బావ : అరెస్ట్ తప్పదా?

74

కోరి కష్టాల్ని తెచ్చిపెట్టుకోవటం పలువురు ప్రముఖుల్లో కనిపిస్తూ ఉంటుంది. తప్పు చేశారా? లేదా? అన్న విషయాల్ని పక్కన పెడితే.. ప్రముఖుల్లో చాలామందికి ఏదో ఒక విషయానికి సంబంధించి కేసుల చిక్కుల్లో చిక్కుకుంటారు. అలా చిక్కుకున్న వేళ.. న్యాయస్థానాల విచారణ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. కానీ.. అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ తరచూ చిక్కుల్లో చిక్కుకుంటూ ఉంటారు. తాజాగా అలాంటి తలనొప్పినే ఎదుర్కొంటున్నారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బావ బ్రదర్ అనిల్ కుమార్. మత ప్రభోదకుడిగా మంచి పేరున్న బ్రదర్ అనిల్ కు తాజాగా ఒక కేసులో నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ కావటం ఆసక్తికరంగా మారింది. ఇంతకీ ఆయన చేసిన తప్పేంటి? అరెస్ట్ వారెంట్ ఎందుకు ఇష్యూ అయ్యిందన్న విషయానికి వస్తే…

Image result for brother anil

2009 మార్చి 28వ తేదీన ఖమ్మం కరుణగిరి ప్రాంతంలో ఒక పార్టీకి అనుకూలంగా ఆయన ప్రచారం చేశారని అప్పట్లో ఆయనపై కేసు నమోదైంది. ఎన్నికల ప్రచార గడువు ముగిసిన తరువాత ఆయన కరుణగిరిలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు కరపత్రాలు పంచారని ఆయనపై రాజకీయ ప్రత్యర్థులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బ్రదర్ అనిల్ పై మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కింద కేసు నమోదైంది. 188 ఐపీసీ సెక్షన్ కింద కేసు రిజిస్టర్ అయింది. బ్రదర్ అనిల్ హైకోర్టులో దీనిపై క్వాష్ పిటిషన్ వేశారు. అనిల్ ను అరెస్ట్ చేయొద్దని ఆ మధ్య హైకోర్టు సూచించింది. ఆ తర్వాత కేసు సుప్రీంకోర్టుదాకా వెళ్లింది. ఆరు నెలల్లో కేసు క్లోజ్ కాకపోతే క్వాష్ పిటిషన్ రద్దైనట్టేనంటూ సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో కేసు విచారణకు హాజరు కావాలని ఖమ్మం కోర్టు జడ్జి సమన్లు జారీచేశారు. ఈ సమన్లకు కూడా బ్రదర్ అనిల్ నుంచి రిప్లై రాలేదు. విచారణకు హాజరుకాలేదు. దీంతో అతడిపై నాన్ బెయిలబుల్ వారెంట్ ను కోర్టు జారీచేసింది.

ఆ కేసులో ఏ1గా ఉన్న అనిల్‌ కుమార్‌ ఇన్నాళ్లూ న్యాయస్థానానికి హాజరు కాలేదు. దీనితో ఆయనను ఎట్టి పరిస్థితుల్లోనూ సోమవారం న్యాయస్థానంలో హాజరుపరచాలని ఖమ్మం సెకెండ్ అడిషనల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ న్యాయమూర్తి జస్టిస్ ఎం జయమ్మ ఈ నాన్ బెయిల్ అరెస్ట్ వారెంట్‌ జారీ చేశారు. పదేళ్ల క్రితం నాటి కేసు కాబట్టి అంత ఇబ్బంది ఏమీ ఉండదని అనిల్‌కుమార్ సన్నిహితులు చెబుతున్నారు. చూడాలి మరి కోర్ట్ అనిల్ కు ఎలాంటి శిక్ష వేస్తుందో.. మరి బ్రదర్ అనిల్ కు నాన్ బెయిల్ వారెంట్ ఇష్యు చేయడం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.