చంద్ర‌బాబుకి షాక్ ఇచ్చిన అగ్రిగోల్డ్ బాధితులు

409

ఏపీలోనే కాదు ద‌క్షిణాదిన అన్నీ రాష్ట్రాల్లో ఖాతాదారుల‌ను అగ్రిగోల్డ్ నిండా ముంచేసింది. ఇందులో పెట్టుబ‌డి పెట్టిన ల‌బ్దిదారులు త‌మ డ‌బ్బులు ఇప్పించాలి అని ప‌దే ప‌దే ప్ర‌భుత్వాన్ని కోరుతున్నారు. అగ్రిగోల్డ్‌ బాధితులు ప్రతి ఒక్కరికి సొమ్ము తిరిగి ఇప్పిస్తామని గతంలో చెప్పి ప్రస్తుతం వారిని పట్టించుకోకుండా కాలయాపన చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాబోయే రోజుల్లో ఓటేయ వద్దని అగ్రిగోల్డ్‌ బాధితులు గురువారం ఇంటింటా ప్రచారం చేపట్టారు.

Image result for agri gold

చేజర్లతో పాటు చిత్తలూరు గ్రామం లో ఈ ప్రచారం చేపట్టారు. వచ్చే రెండు, మూడు నెలల్లో అగ్రిగోల్డ్‌ బాధితులకు స్పష్టమైన హామీ ఇవ్వాలని వారు తెలిపారు. లేకపోతే ఓడించటం ఖాయమని తెలియజేశా రు. ఈ కార్యక్రమంలో అగ్రిగోల్డ్‌ బాధితులు పాల్గొన్నారు. ఇక పెద్ద ఎత్తున డిపాజిట్లు సేక‌రించి బోర్డు తిప్పేసిన అగ్రిగోల్డ్ ఆస్తులు కోర్టులో ఉన్నాయి…వీటిని ప‌రిష్క‌రించి ఆ ఆస్తులు అమ్మి న్యాయం చేయాలని కోరుతున్నారు డిపాజిట్ దారులు.