చంద్రబాబు హౌస్ అరెస్ట్ రాష్ట్రంలో టీడీపీ ఆందోళనలు

105

రాష్ట్ర, జిల్లాల పార్టీ నేతలు, ప్రజా ప్రతినిధులు రాష్ట్ర వ్యాప్తంగా ‘ఛలో ఆత్మకూరు’ను అడ్డుకోవడంపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు పార్టీ నేతలతో. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. అరెస్ట్‌లను ఖండించారు. నిర్బంధం ద్వారా ప్రజాస్వామ్యాన్ని కాలరాయలేరన్నారు. ప్రశ్నించే గొంతును నొక్కడం ప్రజాస్వామ్యమా అని ప్రశ్నించారు. శాంతియుత నిరసనలను అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. ప్రజాస్వామ్యంలో దీనిని ఒక చీకటి రోజు అని.. ఇదొక నిరసన దినంగా అభివర్ణించారు.

Image result for chandrababu house arrest

పునరావాస శిబిరానికి ఆహారం సరఫరా అడ్డుకుంటారా..? శిబిరంలో బాధితులకు ఇచ్చే ఆహారం అడ్డుకోవడం అమానుషమని చంద్రబాబు వాపోయారు. ఆహారం అందించడానికి వచ్చిన వాళ్లను వెనక్కి పంపేస్తారా..? అని ప్రశ్నించారు. బాధితుల పట్ల ఇంత నిర్దయగా వ్యవహరిస్తారా..? అంటూ మండిపడ్డారు. నిరంకుశ పాలనలో ఉన్నామా, ప్రజాస్వామ్యంలో ఉన్నామా..? అని చంద్రబాబు నిలదీశారు. వైసీపీ ప్రభుత్వ దుర్మార్గాలను ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. ఇలాంటి అరాచకాలు పునరావృతం కారాదన్నారు.

Image result for chandrababu house arrest

బాధితులకు సంఘీభావంగా అందరూ నిరసనలు తెలపాలన్నారు. ఈ రోజు ఉదయం 8గం నుంచి రాత్రి 8వరకు నిరాహార దీక్ష చేస్తానని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు అందరూ దీక్షల్లో పాల్గొనాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఆస్తులకు, ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులదేనన్నారు. ఒక పవిత్ర లక్ష్యం కోసం చేస్తున్న పోరాటమన్నారు. బాధితులకు న్యాయం చేయడంలో విఫలం అయ్యారని విమర్శించారు. న్యాయం చేయమన్న టీడీపీపై కక్ష సాధిస్తున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

Image result for chandrababu house arrest

అలాగే చలో ఆత్మకూరు ప్రకటించిన చంద్రబాబు కు భారీ షాక్ తగిలింది. ఒక పక్క వైసీపీ కూడా చలో ఆత్మకూరు ప్రకటించింది. గుంటూరు లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది . పోలీసులు చంద్రబాబు ని గృహ నిర్బంధం చేసారు. చలో ఆత్మకూరు వెళ్లకుండా ఆయనని నివాసం వద్దనే అడ్డుకున్నారు. దీనికి నిరసనగా, ఇంట్లోనే నిరాహార దీక్షా చేపట్టారు చంద్రబాబు. పలు చోట్ల టీడీపీ నేతల అరెస్ట్ లు మొదలయ్యాయి. టీడీపీ నేతల ఇళ్ల చుట్టూ భారీగా పోలీసులు మోహరించారు.

ఈ క్రింద వీడియో చూడండి

మాజీ మంత్రి పతి పాటి పుల్లారావు, గద్దె రామ్మోహన్ రావు, దేవి నేని ఉమామహేశ్వర్ రావు, శిద్ద రాఘవరావు, అశోక్ రెడ్డి లను హౌస్ అరెస్ట్ చేసారు పోలీసులు. అయితే చలో ఆత్మకూరు కి వెళ్లేటటువంటి కార్యకర్త్తలను పోలీస్ స్టేషన్ లకి తరలించారు. పల్నాడులో తగాదాల విషయాన్ని రాజకీయం గా స్వలాభం కోరకు చేసే ఈ చర్యలను పోలీస్ యంత్రంగం గట్టిగానే తిప్పికోట్టింది. అయితే పల్నాడు లో పోలీసులు 144 సెక్షన్ పెట్టడం తో గుంపులు గుంపులు కనిపిస్తే కఠిన చర్యలు తప్పవు అని హెచ్చరించారు.