చంద్రబాబు నన్ను పార్టీలోకి ఆహ్వానించలేదు-కోట్ల

284

రాష్ట్రంలో ఒంటరిగా పోటీ చేయాలని, పొత్తులు ఉండవని కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీలో పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించి బయటకు వచ్చారు మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి. ఇక ఆయన తెలుగుదేశం పార్టీలో చేరడం ఫైనల్ అయింది.. మరికొద్ది రోజుల్లో ఆయన తెలుగుదేశం కండువా కప్పుకోనున్నారు.. అంతేకాదు ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకురావడానికి కేంద్రం నుంచి పెద్దలు కూడా ఎవరూ కాంగ్రెస్ అధిష్టానం నుంచి చర్చలు జరపకపోవడం ప్రధాన కారణం అని అంటున్నారు.

Image result for కోట్ల

నాతో ఎవరూ మాట్లాడలేదు. టూ లేట్.. ఇప్పుడు రాహుల్గాంధీ ఫోన్ చేసినా హస్తం పార్టీలో ఉండలేను’ అని ఆ పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్రెడ్డి స్పష్టం చేశారు. సీఎం ను అమరావతిలో కలిసి అనంతరం కర్నూలు చేరుకున్న ఆయనకు అభిమానులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా కోట్ల విలేకరులతో మాట్లాడారు. ‘ముఖ్యమంత్రి చంద్రబాబుతో మా కుటుంబానికి ఎన్నో ఏళ్లుగా సన్నిహిత సంబంధం ఉంది. దాంతోనే మమ్మల్ని కలవాలని ఆయన ఆహ్వానించడంతో వెళ్లాం. టీడీపీలో చేరాలని ఆయన నన్ను కోరలేదు. జిల్లాలో సమస్యలు అడిగి తెలుసుకున్నారు’ అని తెలిపారు. ఇక ఆయన తన కార్యకర్తలు అనుచరులతో చర్చించి ఫిబ్రవరి ఆరున తెలుగుదేశంలో చేరుతారు అని తెలుస్తోంది.