చంద్రబాబు తో జేసి రాజీడ్రామా..?

552

అనంతపురం ఎంపి జెసి దివాకర్ రెడ్డి సంచలనాలకు మారుపేరు..సొంత పార్టీనే నేతలనే ఇరుకున పెట్టే ఆయన తాజాగా తెలుగుదేశం లోక్ సభలో ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం ఓటింగ్ లో పాల్గొనబోనని, ఓటింగ్ తరువాత తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. దీనికి కారణం మరో మంత్రి తెలుగుదేశం ఎంపి సుజనా చౌదరి వైఖరే నని ఆయన మాటల బట్టి తెలుస్తోంది..ఈ నేపధ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రంగంలోకి దిగి జేసిని బుజ్జగించే ప్రయత్నంలో రంగంలోకి దిగారు..జేసీతో చంద్రబాబు స్వయంగా ఫోన్ లో మాట్లాడి నచ్చజెప్పినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జేసీ `రాజీనామా`ఎపిసోడ్ తాజాగా మరో మలుపు తిరిగింది. తన రాజీనామా గురించి రేపు సాయంత్రం క్లారిటీ ఇస్తానని జేసీ….మీడియా సమావేశంలో వెల్లడించి అందరికీ షాకిచ్చారు. దీంతో జేసీ…రాజీనామా చేయబోతున్నారా…లేదా అన్న విషయంపై తీవ్ర ఉత్కంఠ ఏర్పడింది.

జేసి రాజీనామా వార్తల నేపధ్యంలో మీడియా ప్రతినిధులు ఆయనను కలిసారు…వారితో తనదైన శైలిలో జేసి అనేక ఆసక్తికర విషయాలను వెల్లడించారు.. తనకు చంద్రబాబు ఫోన్ చేసి మాట్లాడారని అవిశ్వాసంలో పాల్గొనకుంటే టీడీపీకి మాయని మచ్చ అవుతుందని చెప్పారని అన్నారు. తన వల్ల పార్టీకి చెడ్డపేరు రావడం ఇష్టం లేదని దీంతో తన మనసు మార్చుకొని అవిశ్వాసం ఓటింగ్ లో పాల్గొనాలని నిర్ణయించుకున్నానని జేసీ అన్నారు. రాజీనామా గురించి మీడియా ప్రతినిధులు జేసీని ప్రశ్నించగా….ఆయన సమాధానం దాటవేశారు. తన రాజీనామా వ్యవహారాన్ని జేసీ సస్పెన్స్ లో పెట్టారు. అపుడే అంత తొందర ఎందుకని….ఆ విషయం గురించి తర్వాత చూద్దామని…..రేపు సాయంత్రం ఢిల్లీలో ఆ విషయంపై క్లారిటీ ఇస్తానని….జేసీ తనదైన శైలిలో చమత్కరిస్తూ ఆ సమావేశాన్ని ముగించారు. మొత్తానికి జేసీ రాజీనామా వ్యవహారంపై పూర్తి క్లారిటీ రావాలంటే….రేపు సాయంత్రం వరకు వేచి చూడక తప్పదు. మరోవైపు జేసీతో చంద్రబాబు `రాజీ` నామా…నడిపారని…అందుకే జేసీ రాజీనామాపై తన మనసు మార్చుకొని ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.