చంద్రబాబు తో ఉండవల్లి భేటీ…ఎందుకో తెలిస్తే షాక్..!

624

మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే సమైక్యాంధ్ర కోసం గట్టిగా పోరాడినప్పటికీ ఫలితం లేకుండా పోయింది..తాజా ఉండవల్లి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ని కలవడం రాజాకీయ వర్గాల్లో ఆసక్తి కరంగా మారి చర్చనీయాంశం అయింది..ప్రస్తుతం ఉండవల్లి అన్ని పార్టీలకు దూరంగా ఉంటూ తనదైన శైలిలో కీలక అంశాల పట్ల విమర్శలు చేస్తున్నారు..విభజన చట్టానికి సంబంధించి కొన్ని రోజుల క్రితం చంద్రబాబుకు లెటర్ రాసిన ఉండవల్లి తాజాగా ముఖ్యమంత్రి తెలుగుదేశం అధ్యక్షుడితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది..

భవిష్యత్తులో కూడా ఏ పార్టీలో చేరనని ప్రకటిస్తున్న ఉండవల్లి వర్షాకాల సమావేశాల్లో ఎలా పోరాడితే.. కేంద్రం ఆడుతున్న నాటకం బయటకు వస్తుందో.. వాస్తవంగా రాష్ట్రానికి మంచి జరుగుతుందో.. చంద్రబాబును కలిసి వివరించారు. నిజానికి ఉండవిల్లి చేసిన సూచనలు మంచివే.. కానీ లోక్ సభలో ప్రస్తుతం 16 మంది సభ్యులను కలిగి ఉన్న తెలుగుదేశం వాటిని ఆచరిస్తుందా లేదా? అనేదే సందేహంగా ఉంది. న్యాయ నిపుణుడు కూడా అయిన ఉండవల్లి అరుణ్ కుమార్ రాజ్యాంగ వ్యవహారాలు, సభా నియమాలు, తీరుల మీద అవగాహన ఎక్కువ. అసలు విభజన జరిగిన తీరే.. అరాచకం అనేది ఆయన విశ్లేషణ. పార్లమెంటులో ప్రస్తుతం గళమెత్తగల వారిగా తెలుగుదేశం ఎంపీలు మాత్రమే ఉన్న తరుణంలో.. ఆయన చంద్రబాబును కలిశారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయం ప్రపంచానికి తెలిసేలా.. ప్రభుత్వం నోటితోనే ఆ విషయం చెప్పేలా ఎలాంటి ప్రశ్నలు సంధించాలో.. ఆయన చంద్రబాబుకు సూచించారు. ఇదంతా చాలా మంచి ప్రయత్నం…

అయితే ఇక్కడ ఓ మతలబు ఉంది…ప్రత్యేక హోదా విభజన అంశాల అమలు చేయాలని పోరాడుతున్న చంద్రబాబు అంతిమ లక్ష్యం వచ్చే ఎన్నికల్లో తిరిగి గెలవడమే కాదనలేని నిజం..అందుకే ఫలితం రాబట్టే మార్గాలు కాకుండా, ప్రచారానికి పెద్దపీట వేసే మార్గాలనే ఆయన అనుసరిస్తున్నారని అంతా అంటుంటారు. అటువంటి చంద్రబాబు ఉండవల్లి సూచనలు పాటిస్తారా అంటే లేదా తన పొలిటికల్ మైలేజీ కోసం ఎప్పటిలాగే డ్రామాలు ఆడుటారా అనేది తెలియాలంటే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరిగే వరకూ వేచి చూడాలి…