చంద్రబాబుతో బాబా రాందేవ్‌ భేటీ,172 కి గ్రీన్ సిగ్న‌ల్

402

ఏపీకి పెట్టుబ‌డులు ఆక‌ర్షించ‌డంలో ఏపీ ప్రభుత్వం ముందు ఉంది అని చెబుతున్నారు ప్ర‌భుత్వ అధికారులు నేత‌లు. తాజాగా ప‌లు కంపెనీలు రావ‌డానికి ఇదే నిద‌ర్శ‌నం అని చెబుతున్నారు.సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో యోగా గురువు బాబా రాందేవ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా విజయనగరం జిల్లా చిన్నరావుపల్లిలో పతంజలి సంస్థ ఏర్పాటు చేసే ‘మెగా ఫుడ్ పార్క్’ గురించి ముఖ్యమంత్రికి రాందేవ్ వివరించారు. రూ.634 కోట్లతో ఆహార శుద్ధితో పాటు అనుబంధ యూనిట్ల ఏర్పాట్లు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. దాదాపు 33,400 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు. దీంతో ‘మెగా ఫుడ్ పార్క్’కు ప్రభుత్వం 172.84 ఎకరాలు కేటాయించింది.

Image result for చంద్రబాబుతో బాబా రాందేవ్‌

రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నామని బాబా రాందేవ్‌కు ముఖ్యమంత్రి వెల్లడించారు. అలాగే రసాయనాలు, పురుగు మందులు లేకుండా వ్యవసాయ ఉత్పత్తులు దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని చంద్రబాబు తెలిపారు…దీని వ‌ల్ల విజ‌య‌న‌గ‌రం జిల్లాకు ప్ర‌యోజ‌నం ఉంటుంది అని, అలాగే జిల్లాలో నిరుద్యోగ యువ‌త‌కు ఉద్యోగాలు వ‌స్తాయి అని అధికారులు చెబుతున్నారు.