గత ఎన్నికల్లో నేను చేసిన పొరపాట్లే నా ఓటమికి కారణం…జగన్ సంచలన వ్యాఖ్యలు..

707

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైస్ ఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ప్రజా సంకల్ప యాత్ర పేరుతొ చేస్తున్న పాదయాత్ర తాజాగా 2500 కిమీ పూర్తీ చేసుకొని సాగుతోంది..ఈ సందర్భంగా ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్న జగన్ ఒక ప్రైవేట్ చానల్ కిచ్చిన ఇంటర్వ్యూ లో ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మీద విరుచుకు పడ్డారు.. ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీతో జతకట్టి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు అవినీతిలో అనకొండలా మారారని విమర్శించారు…

ప్రత్యేక హోదా పై పూటకో మాట మారుస్తూ యు టర్న్ చంద్రబాబుగా మారారని సంచలన వ్యాఖ్యలు చేసారు..” భారతీయ జనతా పార్టీతో నాలుగేళ్లు కాపురం చేసి ఆయన ఏం సాధించారు. ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీయే మేలంటూ ఏకంగా అశంబ్లీలో తీర్మానం చేసారు. ఆ ప్రతిని కేంద్రం సుప్రీం కోర్టులో దాఖలు చేసింది.” అని జగన్ స్పష్టం చేసారు. రాజధాని లో ఇప్పటివరకూ ఒక్క ఇటుకైనా పడలేదు అని, ప్రభుత్వం చేస్తున్న ప్రతీ పధకం లోనూ విపరీతంగా అవినీతి చోటు చేసుకుందని ఆయన వ్యాఖ్యానించారు..అంతే కాకుండా గత ఎన్నికల్లో ఒక బిజెపి మరో వైపు పవన్ కళ్యాణ్ మద్దతు తో చంద్రబాబు గెలిచారని, రెండు పార్టీల ఓట్లు తేడా కేవలం ఐదు లక్షలేనని ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేసారు..తానూ చేసిన పొరపాట్లు కూడా 2014 ఎన్నికల్లో తమ పార్టీ ఓటమికి కారణం అని కూడా చెప్పారు…

తమ పార్టీ అధికారంలోకి వచ్చి తాను ముఖ్యమంత్రి అయితే రాష్ట్రంలో అవినీతి లేకుండా చేస్తానని చెప్పారు. పాదయాత్రలో జగన్ కు రాజకీయ పరిణితి రావడమే కాకుండా ప్రజల కష్టాల పట్ల ఓ అవగాహన వచ్చిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.