క్లింటన్ -మోదీ సీక్రెట్ చెప్పిన చంద్రబాబు

307

అమరావతిలో నేడు అఖిలపక్ష సమావేశం జరిగింది, ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మోదీ రాజకీయాల్లో తన జూనియర్ అని, అయినా మోదీ అహాన్ని సంతృప్తిపరచడానికి తాను ‘సార్’ అని పిలిచేవాడినని ఆయన వ్యాఖ్యానించారు. గౌరవం రెస్పెక్ట్ నేను ఎవరికి అయినా ఇస్తాను అని తెలియచేశారు, ఇకతాను అనేకమందిపెద్దపెద్ద నాయకులని కలిశాను అని వివరించారు.

Image result for Clinton

తాను అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ను కలిసిన సందర్భంలో కూడా ఆయనను మిస్టర్ క్లింటన్ అని మాత్రమే సంబోధించానని.. సార్ అని పిలవలేదని చెప్పారు. కానీ మోదీ ప్రధానిగా అయిన తర్వాత ఆయనను ఇప్పటిదాకా దాదాపు 10సార్లు సార్ అని పిలిచానని చంద్రబాబు తెలిపారు. కేవలం రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే.. మోదీ అహం సంతృప్తి చెందేలా సార్అ ని పిలిచానని చంద్రబాబు వ్యాఖ్యానించడం విశేషం. ఇక వీరితో పొత్తుపెట్టుకోవడం వల్ల తాముపొందింది తక్కువ సీట్లే అని వారితో పొత్తుపెట్టుకోకుండాఉంటే మరో 10 సీట్లు ఎక్కువ సాధించేవారిమి అన్నారుఆయన.