కోడికత్తిపార్టీ అంటూ హీరోయిన్ ఫైర్

205

లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాపై టీడీపీ నేతలు, నటి దివ్యవాణి, దేవీబాబు, బ్రహ్మంచౌదరి ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. ఈసీ కోరిన డాక్యుమెంట్లు అందజేస్తామన్నారు. ఈ సందర్భంగా దివ్యవాణి మీడియాతో మాట్లాడుతూ లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం వెనుకున్నది కోడికత్తి పార్టీనే అని విమర్శించారు. కావాలనే ఎన్నికల సమయంలో ఈ సినిమా ద్వారా తెలుగుదేశం పార్టీ పరువు తీయాలి అని భావిస్తున్నారు, చంద్రబాబు పాలనలో అందరూ బాగున్నారు, కేవలం పదవీ కాంక్షతో జగన్ వైసీపీ నేతలుచేస్తున్న కుట్రలు అని ఆమె ఫైర్ అయ్యారు. దర్శకుడు రాంగోపాల్వర్మ ఉన్మాదిలా వ్యవహరిస్తున్నారని ఆమె మండిపడ్డారు. ఎన్టీఆర్ జీవితంలో లక్ష్మీపార్వతి విషపుచుక్కని దివ్యవాణి తీవ్రస్థాయిలో విమర్శించారు.