కేసీఆర్ ప్ర‌ధాని కావాలి అని మా ఆకాంక్ష‌

350

తెలంగాణ‌లో రెండోసారి అధికారంలోకి వ‌చ్చిన టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు పాల‌న ప‌నిలో ఉంది, అయితే కేసీఆర్ మాత్రం కేంద్రంలో చ‌క్రం తిప్పేలా జాతీయ రాజ‌కీయాల్లోకి వెళ్లే ఆలోచ‌న‌లో ఉన్నారు. ఇక ప‌లు పార్టీలను ఏకం చేసి కాంగ్రెస్ బీజేపీకి వ్య‌తిరేక కూట‌మిగా రెడీ అవుతున్నారు.తాజాగా కేసీఆర్ ప్రధాని కావాలని కోరుకుంటున్నామని హోంమంత్రి మహమూద్ అలీ ఆకాంక్షించారు.

Image result for kcr
కేసీఆర్ లాంటి వ్యక్తి ప్రధాని అయితేనే ముస్లింలు బాగుపడతారన్నారు. తెలంగాణలో 95 శాతం ముస్లింలు కేసీఆర్‌తోనే ఉన్నారని తెలిపారు. కాంగ్రెస్‌ నేతల మాటలను ముస్లింలు నమ్మలేదన్నారు. కేసీఆర్‌ పాలనలో ఓల్డ్‌సిటీ…గోల్డ్‌సిటీగా మారిందని పేర్కొన్నారు. సమైక్య రాష్ట్రంలో ఓల్డ్‌సిటీని బద్నాం చేశారని మండిపడ్డారు. తెలంగాణలో శాంతియుత వాతావరణం ఉండేలా కృషి చేస్తానని హోంమంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు.