కేసీఆర్ పై రాహుల్ పంచ్

251

తెలంగాణ ఎన్నికల స‌భ‌ల్లో స‌రికొత్త పొలిటిక‌ల్ వార్ క‌నిపిస్తోంది ఒక‌టా రెండా అనేక హామీలు ఇస్తూ ప్ర‌జ‌ల‌కు ద‌గ్గ‌ర అవుతున్నాయి రాజ‌కీయ పార్టీలు అయితే ఏ హామీ ప్ర‌జ‌ల‌కు ద‌గ్గ‌ర అవుతుంది అనేది చూడాలి. ఇక ప్ర‌చారాల్లో భాగంగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. గద్వాలలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ బహిరంగ సభలో రాహుల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. కేసీఆర్ అంటే ఖావో కమీషన్ రావు అంటూ చమత్కరించారు.

Image result for kcr

తెలంగాణ‌లో ప‌రిపాల‌న అస్త‌వ్య‌స్తం చేశారు అని .. కేసీఆర్ కమీషన్లు మాత్రమే మేస్తున్నారంటూ విమర్శించారు. ధనిక రాష్ట్రమైన తెలంగాణలో నాలుగున్నరేళ్లలో రూ. లక్షన్నర కోట్లు అప్పు చేశారని, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి కేసీఆర్ కుటుంబం ఆస్తులు పెంచుకుందని రాహుల్ ఆరోపించారు. అలాగే రాష్ట్రంలో 30 లక్షల మంది యువతకు ఉద్యోగాలు లేవని, తెలంగాణలో ఒక కుటుంబం మాత్రమే బంగారు కుటుంబమైందని రాహుల్ అన్నారు. రైతుల‌కు తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తుంది అని రుణ‌మాఫీ చేసి రైతు ఆత్మ‌హ‌త్య‌లు లేని తెలంగాణ చేస్తాము అని అన్నారు రాహుల్.