కేసీఆర్ పై నారాయ‌ణ కౌంట‌ర్లు

350

తెలంగాణ ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్ర‌చారాలు హోరెత్తిస్తున్నారు పార్టీల నాయ‌కులు .. రాజ‌కీయంగా ఇప్పుడు ఏపార్టీ కూడా ఇక్క‌డ పొత్తుల లేకుండా పోటీ చేయ‌డం లేదు ఇటు ఎంఐఎం టీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందం చేసుకున్నారు అని విమ‌ర్శిస్తుంటే ఇటు మ‌హాకూట‌మిలో తెలంగాణ పార్టీలు అన్నీ క‌లిసి ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌ల ముందుకు వ‌స్తున్నాయి… ఈ స‌మయ‌లో రాజ‌కీయ నాయ‌కులు ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌ల బాణాలు ఎక్కుపెడుతున్నారు.

Image result for kcr
కేసీఆర్‌ ఏనాడూ బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడలేదని సీపీఐ నేత నారాయణ అన్నారు. కేసీఆర్‌కు తాను ఓడిపోతున్నట్టు అర్ధమైందని విమర్శించారు. బీజేపీ, ఎంఐఎంలతో కలిసి టీఆర్‌ఎస్‌ అవకాశవాద రాజకీయాలు చేస్తోందని వ్యాఖ్యానించారు. ఐదేళ్ళు పూర్తి కాకుండానే ప్రభుత్వాన్ని రద్దు చేసిన కేసీఆర్‌కు ఈ ఎన్నికల్లో ప్రజలే సరైన జవాబు చెబుతారని ఆయన పేర్కొన్నారు.