కేసీఆర్‌తో- ఒవైసీ ఫుల్ క్లారిటీ

292

తెలంగాణ‌లో ఎన్నిక‌ల ఫ‌లితాలు రేపు తేల‌నున్నాయి. ఈస‌మ‌యంలో పార్టీల నేత‌లు ఎవ‌రు గెలుస్తారు ఎవ‌రు ఓడిపోతారు ఎవ‌రు ర‌న్న‌ర్ విన్న‌ర్ అనేది తేల‌నుంది… ఈ స‌మ‌యంలో మజ్లిస్‌ పార్టీ అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ సోమవారం సీఎం కేసీఆర్‌తో భేటీ కానున్నారు. అసెంబ్లీ ఓట్ల లెక్కింపునకు ముందు రోజు ఇరువురి భేటీ రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. రాష్ట్రంలో హంగ్‌ ఏర్పడితే ఏం చేయాలన్న అంశంపై వీరు చర్చించే అవకాశం ఉన్నట్లు తెలిసింది.

Image result for kcr owaisi

రాజేంద్రనగర్‌ స్థానాన్ని కైవసం చేసుకుంటానన్న ధీమాతో ఉన్న మజ్లిస్‌ పార్టీ.. హంగ్‌ వస్తే 8 సీట్లతో కింగ్‌ మేకర్‌గా మారనుంది. అయితే, మిత్రపక్షమైన టీఆర్‌ఎస్‌ను కాదని కాంగ్రెస్‌కు మద్దతిచ్చే ప్రసక్తే లేదని మజ్లిస్‌ నేతలు అంటున్నారు. తమకు పూర్తి మెజారిటీ వస్తుందని టీఆర్‌ఎస్‌ అంటోంది. అదే సందర్భంలో మెజారిటీ తగ్గితే అండగా నిలవాలని ఒవైసీని కేసీఆర్‌ కోరే అవకాశముంది. ఇక కుద‌రితే మంత్రి ప‌ద‌వి లేదా డిప్యూటి కూడా ఇచ్చే అవకాశం ఉంది అని తెలుస్తోంది.