కేటీఆర్ పేరు అజ‌య్ రావు యాష్కి సంచ‌ల‌న కామెంట్లు

300

తెలంగాణ‌లో ఎన్నిక‌ల వేళ స‌మీక‌ర‌ణాలు మారిపోతున్నాయి.. ముఖ్యంగా అధికార పార్టీకి షాక్ ల మీద షాక్ లు ఇస్తోంది కాంగ్రెస్ పార్టీ.తెలంగాణ‌లో అధికారాన్ని అడ్డుపెట్టుకొని కేసీఆర్‌ కుటుంబం భారీగా ఆస్తులు కూడబెట్టిందని కాంగ్రెస్ నేత మధుయాష్కి ఆరోపించారు. ఇక్క‌డ ప్రాజెక్టుల్లో కాంట్రాక్ట‌ర్లు ఇచ్చిన క‌మీష‌న్ల‌తో విదేశాల‌లో కంపెనీలు పెట్టారు అని యాష్కి విమ‌ర్శించారు. కేటీఆర్‌ అక్రమాస్తులు నిరూపించేందుకు తాము సిద్ధమని సవాల్ విసిరారు.

Image result for ktr
2001లో రూ.10లక్షలున్న కేసీఆర్‌ ఆస్తి… ఇప్పుడెంత? అని ప్రశ్నించారు. కేటీఆర్‌ ఆస్తి 2009లో రూ.కోటి, 2014లో రూ.41కోట్లా? అని నిలదీశారు. మలేసియా, యూఎస్‌ కంపెనీలతో చీకటి ఒప్పందాలు చేసుకున్నారని ఆరోపించారు. బెంగళూరులో కేటీఆర్‌కు బినామీలున్నారన్నారు. డాలర్‌ కాలనీలో కవితకు విల్లా ఎక్కడిదని మధుయాష్కీ నిలదీశారు. కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అసలు పేరు కల్వకుంట్ల తారకరామారావు కాదని, కల్వకుంట్ల అజయ్‌రావు అని తెలిపారు. మొత్తానికి ఇటు మ‌హాకూట‌మి అటు తెరాస ఎన్నిక‌ల ప్రచారంలో హోరెత్తిస్తున్నాయి.