కేటీఆర్ దగ్గ‌ర అప్పు తీసుకున్న కేసీఆర్

391

మొత్తానికి ఎన్నిక‌ల వేళ క‌నిపించే చిత్రాలు మ‌ళ్లీ ఐదు సంవ‌త్స‌రాల వ‌ర‌కూ క‌నిపించ‌వు.. రాజ‌కీయంగా ఎన్నో చిత్ర‌విచిత్ర‌మైన ప‌రిస్దితులు క‌నిపిస్తాయి. అయితే తెలంగాణ ఎన్నికల వేళ ఇప్పుడు స‌రికొత్త రాజ‌కీయ హీట్ క‌నిపిస్తోంది. నామినేష‌న్ల ప‌నిలో రాజ‌కీయ పార్టీల అభ్య‌ర్దులు ఉన్నారు. ఇటు టీఆర్ ఎస్ త‌రపున అంద‌రూ నామినేష‌న్ ప‌నిలో బిజీగా ఉన్నారు. కేసీఆర్ కూడా త‌న నామినేష‌న్ స‌మ‌ర్పించారు.

Image result for kcr and ktr

తాజాగా కేటీఆర్ మీట్ ద ప్రెస్ లో ఓ కీల‌క విష‌యం తెలియ‌చేశారు..తండ్రీకొడుకుల మధ్య మానవ సంబంధాలుండవా?! మీ ఇంట్లో మీ కొడుకుకు అవసరమైతే డబ్బులు ఇవ్వరా? ఆయన వద్ద ఉంటే మీరు తీసుకోరా!?’’ అని మంత్రి కేటీఆర్‌ ప్రశ్నించారు. ఇంత‌కీ ఎందుకు ఇలాంటి ప్ర‌శ్న అని అనుకుంటున్నారా? సీఎం కేసీఆర్‌ తాను దాఖలు చేసిన అఫిడవిట్‌లో కేటీఆర్‌ నుంచి అప్పు తీసుకున్నట్లు పేర్కొన్న అంశాన్ని ఓ విలేకరి ప్రస్తావించారు. ఎందుకు ఇచ్చారు.. కేసీఆర్‌ ఎందుకు తీసుకున్నారు? అని ప్రశ్నించారు. దానికి జవాబు ఇవ్వకుండా కేటీఆర్‌ తీవ్ర అసహనం ప్రదర్శించారు. కుటుంబంలో అవసరమైతే చేబదులు తీసుకోరా అని ప్రశ్నించారు. కేబినెట్‌లో మహిళా మంత్రులు లేకపోవడంపై మహిళా ప్రతినిధి అడిగిన ప్రశ్నకూ ఒకింత అసహనం ప్రదర్శించారు. కేబినెట్‌ కూర్పులో అనేక సమీకరణాలు ఉంటాయని, భవిష్యత్తు కేబినెట్‌ కూర్పులో మహిళా మంత్రి ఉండవచ్చని చెప్పారు.