కేటిఆర్ ది పక్షపాత వైఖరి..కవిత షాకింగ్ కామెంట్స్…

612

తెలంగాణ ప్రభుత్వంలో సిఎం కేసిఆర్ వారసులుగా దూసుకుపోతున్నారు మంత్రి కేటిఆర్ ఎంపి కవితలు..కేటిఆర్ తెలంగాణ ప్రభుత్వంలో అన్నీ తానై చూసుకుంటూ ఉండగా కవిత డిల్లీ లో పనులు చక్కబెడుతున్నారు..తాజాగా వీరిద్దరూ నిజామాబాద్ ఐటి హబ్ శంకుస్థాపన సభలో ఆసక్తికర వ్యాఖ్యానాలతో అందరినీ ఆకర్షించారు..

ఈ సందర్భంగా ఎంపీ కవిత మాట్లాడుతూ.. ఉమ్మడి ఏపీలో ఐటీ రంగం అంటే హైదరాబాద్ కే పరిమితమైందని.. ఇప్పుడు అన్ని జిల్లాలకు ఐటీ విస్తరిస్తున్నారని అన్నారు. ఐటీలో కొత్త ఆవిష్కరణలకు నిజామాబాద్ కేంద్రం కావాలని ఆమె ఆకాక్షించారు. అయితే ఈ సందర్భంగా తన అన్నయ్య కేటీఆర్ ను అభివృద్ధిలో పక్షపాతం చూపవద్దంటూ ఇరికించారు. అన్నయ్య కేటీఆర్ దృష్టి ఎప్పుడూ తన ప్రాతినిధ్యం వహించే ఉమ్మడి కరీంనగర్ జిల్లాపైనే ఉంటుందని.. జర ఆ ప్రేమను చెల్లెలు ప్రాతినిధ్యం వహించే నిజామాబాద్ పైనా చూడాలని సభాముఖంగా కోరుతున్నానని విన్నవించింది. ఇలా బహిరంగ సభలో అభివృద్ధి విషయంలో అన్నయ్య కేటీఆర్ పక్షపాతం చూపిస్తాన్నడని అనేసరికి అందరూ ఆశ్చర్యపోయారు. అయితే అభివృద్ధి గురించే ఈ కోరిక కోరడంతో అందరూ కవిత సమయస్ఫూర్తితో కేటీఆర్ ను ఇరికించిందని వ్యాఖ్యానించారు.