కేఈ- కోట్ల కలుస్తారా- విభేదిస్తారా?

219

కర్నూలు జిల్లా టీడీపీలో కేఈ కుటుంబం హవా కొనసాగుతోంది. మరి ఇప్పుడు కోట్ల కుటుంబం తెలుగుదేశం పార్టీలో చేరితే ఎలాంటి పరిస్దితి ఉంటుంది… పార్టీలో వారు ఇద్దరు కలిసి ముందుకు వెళతారా, ఇలాంటి ప్రశ్నలు అనేకం ఎదురు అవుతున్నాయి జిల్లాలో.. కేఈ కోట్ల కుటుంబాలకు రాజకీయ వైరం ఏనాటి నుంచో ఉంది.

Image result for కేఈ

 

తాజాగా రాజకీయ సమీకరణ నేపథ్యంలో కోట్ల కుటుంబం టీడీపీలో చేరబోతుంది. కేఈ, కోట్ల కుటుంబాల మధ్య దశాబ్దా రాజకీయ వైరం ఉంది మరి వీరు కలిసి పని చేస్తారా అనే ఆలోచన ఉంది. ఒకటి రెండు ఎన్నికల్లో మినహా ఎక్కువ సందర్భాల్లో ఈ రెండు కుటుంబాలు ప్రత్యర్థులుగా బరిలో దిగి తలపడ్డాయి. ఈ నేపథ్యంలో కేఈ, కోట్ల కుటుంబాలు టీడీపీ గొడుగు కింద కలిసి పని చేస్తాయా..? అన్నది జిల్లాలో పలువురి మదిలో వేధిస్తున్న ప్రశ్న. మరి డోన్ సెగ్మెంట్ పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి ఇక్కడ కేఈ సోదరుడు కూడా టికెట్ ఆశిస్తున్నారు.