కేంద్రం మోసం చేసిందంటే ప్రజలు నమ్ముతారా..చంద్రబాబుకు పవన్ సూటి ప్రశ్న..

514

నిన్న తెలుగు దేశం పార్లమెంట్ లో ప్రవేసపెట్టిన అవిశ్వాస తీర్మానం చర్చలో భాగంగా కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం గా మారాయి..టీడీపీ ఎన్డీయే నుంచి బయటకు వెళ్లినప్పటికీ చంద్రబాబు తమకు మిత్రుడేనని ఆయన చెప్పారు. ఇది ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. ఈ విషయంపై ప్రతిపక్ష పార్టీ వైసిపి ఎంపి విజయ్ సాయి రెడ్డి విమర్శించారు..ఆయన వ్యాఖ్యలపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాన్ ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని సూటిగా ప్రశ్నించారు…

‘ఇంత సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉండి,ఇప్పుడే పుట్టిన పాలుగారే పసిపిల్లల లాగా… కేంద్రం చేత మోసగింపపడ్డాం ..అంటే,ప్రజలు నమ్ముతారు .. అని టీడీపీ నాయకులు ఎలా అనుకుంటారు?’ అని పవన్ ట్వీట్ చేశారు. ‘రాజనాథ్ సింగ్ గారి మాటలు ” ఏపీ ముఖ్యమంత్రి మాకు ఇంకా మంచి మిత్రుడే అంటం ” చూస్తుంటే.. టీడీపీ – బీజేపీ ఇంకా కలిసి ఉన్నాయని స్పష్టమౌతుంది. ఇద్దరు కలిపి ఏపీ ప్రజల భావోద్వేగాలతో ఆడుకుంటున్నారు అనిపిస్తుంది.’ అని మరో ట్వీట్ చేశారు. ఆ తర్వాత చంద్రబాబు ప్రత్యేక హోదాపై ఏఏ సందర్భాల్లో ఎలా మాట మార్చారో ఓ సుదీర్ఘ ట్వీట్ చేశారు.

తెలుగుదేశం బిజెపి ల మధ్య లోపాయికారీ బందం బయటపడిందని రాజ్ నాథ్ సింగ్ వ్యాఖ్యలతో స్పష్టమయిందని వైకాపా నేత విజయసాయి రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు..కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యలతో ఆ రెండు పార్టీల స్నేహం వెలుగు చూసిందన్నారు..