కారెక్కనున్న సబితాఇంద్రారెడ్డి మంత్రి పదవి ఎంపీ టికెట్

185

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలేలా ఉంది.. మాజీ హోంమంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అధికార పార్టీ టీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధం కావడం ఆ పార్టీకి కోలుకోని దెబ్బగానే రాజకీయవర్గాలు భావిస్తున్నాయి.. టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ ఎలా ఉన్నా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో నాయకులను ఎమ్మెల్యేలను కాపాడుకోలేని విధంగా ఉంది అనే విమర్శ వినిపిస్తోంది.. లోక్ సభ ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీనినిర్వీర్యం చేసే విధంగా ఉంది టీఆర్ఎస్ అనే వార్తలు వస్తున్నాయి.

Image result for సబితాఇంద్రారెడ్డి

ఇక జిల్లాలో మంచి కేడర్ ఉన్న ఆమెతో పాటు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నుంచి చేరికలు ఉండే అవకాశముంది.. జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులతో పాటు మరికొందరు ముఖ్యనేతలు కారు పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. సబితారెడ్డి రాకతో చేవెళ్ల, మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో టీఆర్‌ఎ్‌సకు భారీగా మేలు జరిగే అవకాశం ఉంది. అందుకే టీఆర్ఎస్ ఆగమేఘాల మీద ఆమెను చేర్చుకునేందుకు పావులు కదిపింది.

Image result for సబితాఇంద్రారెడ్డి

ఈ మేరకు ఆదివారం ఎంఐఎం అధినేత అసదుద్దీన్ నివాసంలో టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌తో సబితారెడ్డి భేటీ అయ్యారు. సమావేశంలో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ కూడా ఉన్నారు. వాస్తవానికి సబితారెడ్డి కాంగ్రెస్‌ను వీడుతున్నట్లు కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. ఆదివారం కేటీఆర్‌తో భేటీ కావడంతో ఆమె చేరిక ఖరారైంది. ఇక సబితా ఇంద్రారెడ్డికి మంత్రి పదవితో పాటు ఆమె కుమారునికి ఎంపీ సీటు ఇచ్చేందుకు టీఆర్ఎస్ అంగీకారం తెలిపినట్టు తెలుస్తోంది.మరోపక్క చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థిగా మహేందర్‌రెడ్డిని బరిలోకి దింపాలని భావించిన టీఆర్ఎస్ అనూహ్యంగా కొత్త వ్యక్తిని తీసుకోవాలని నిర్ణయించింది. సొ ఇక్కడ ఎలాంటి రాజకీయం జరుగుతుందో చూడాలి.