కాపులకు బాబు బంపర్ ఆఫర్

207

ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు హామీల వర్షం కురిపిస్తున్నాయి అనేచెప్పాలి.. సీఎం చంద్రబాబు మరోసారి అధికారంలోకి రావాలి అని ఓ పక్క హామీలు ఇస్తుంటే, మరో పక్క జగన్ అధికారంలోకి ఈసారి ఎలాగైనా రావాలి అని నవరత్నాలు తీసుకువస్తున్నారు.. అయితే కాపుల అంశం ప్రత్యేక హోదా అంశాలు రాజకీయంగా చర్చ జరుగుతున్నవి ఏపీలో.. తాజాగా అగ్రకులాల్లో కాపులు సగంపైగా ఉన్నారని, కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాల శాతమే అధికమని, అందుకే ఈడబ్ల్యుఎస్ 10% రిజర్వేషన్లలో కాపులకు 5% ఇచ్చామని ఆయన స్పష్టం చేశారు.

Image result for chandra babu meetings

కులాల్లో చిచ్చుపెట్టాలని వైసీపీ, బీజేపీ నేతలు చూస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు. సీఎం టీడీపీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిపక్షాల కుట్రలను తిప్పికొట్టాలని సూచించారు. ఇలాంటి కుట్ర రాజకీయాలు చేసేవారిని తిప్పి కొట్టాలని చెప్పారు ఆయన కాపు రిజర్వేషన్లను బీజేపీ, వైసీపీ నేతలు వక్రీకరిస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. ఢిల్లీ వెళ్లి కాపుల రిజర్వేషన్ల గురించి అడగలేని అసమర్ధులు వాళ్లని, కాపులకు మేలు చేసిన టీడీపీని నిందిస్తున్నారని ముఖ్యమంత్రి మండిపడ్డారు.. పార్టీ తరపున దీనిపై ప్రచారం చేయాలని కాపులకు టీడీపీ వెన్నంటి ఉంటుందని తెలియచేశారు బాబు. ఆటోలు, ట్రాక్టర్లపై పన్ను తొలగింపుతో ఎంతో ఊరట లభించిందని చంద్రబాబు అన్నారు.