కాంగ్రెస్ కార్య‌కర్త‌ల‌కు భ‌రోసా ఇచ్చిన రేవంత్ రెడ్డి

340

తెలంగాణ ఎన్నిక‌ల ప్ర‌చార ప‌ర్వం ర‌స‌వ‌త్త‌రంగా సాగుతోంది..ఇప్ప‌టికే కూట‌మి నుంచి రాహుల్, చంద్ర‌బాబు, ఉత్త‌మ్, రేవంత్ త‌మ ప్ర‌సంగాల‌తో తెలంగాణ‌లో కూట‌మి అభ్య‌ర్దుల విజ‌యానికి కృషి చేసేలా ప్ర‌ణాళిక బ‌ద్దంగా ముందుకు వెళుతున్నారు. ఇక టీఆర్ ఎస్ అధినేత గులాబీ బాస్, కేసీఆర్ అలాగే మంత్రి కేటీఆర్ కూడా ప్ర‌చారంలో దూసుకుపోతున్నారు. ఒక‌రు ఆశీర్వాద స‌భ‌లు మ‌రొక‌రు గ్రేట‌ర్ లో రోడ్ షోల‌తో దూసుకువెళుతున్నారు జ‌నంలోకి.. తాజాగా రేవంత్ ప‌లు సంచ‌ల‌న కామెంట్లు చేశారు టీఆర్ఎస్ నేత‌ల‌పై..

Image result for revanth reddy meeting images

కేసీఆర్‌ అబద్దాలతో ప్రభుత్వాన్ని నడిపారని కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి అన్నారు. నర్సంపేటలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఇంటికో ఉద్యోగం.. డబుల్‌ బెడ్రూమ్.. దళితులకు మూడు ఎకరాలు ఇవ్వలేదని విమర్శించారు. జూరాల నీరు పాకాలకు తెస్తానన్న కేసీఆర్‌.. చుక్క నీరు తేలేదని ఆరోపించారు. పెద్ది సుదర్శన్‌రెడ్డి కమీషన్ ఏజెంట్‌గా మారారని చెప్పారు. అధికారులు కాంగ్రెస్ కార్యకర్తలను ఇబ్బంది పెడితే వదిలిపెట్టమని రేవంత్ హెచ్చరించారు. ఎన్నిక‌ల త‌ర్వాత అంత‌కు ముందు కాంగ్రెస్ నేత‌ల‌కు ఏ స‌మ‌స్య ఉన్నా రేవంత్ ఉన్నాడు అని ఆయ‌న భ‌రోసా ఇచ్చారు.. ఎన్నిక‌ల స‌మ‌యంలో టీఆర్ఎస్ కాంగ్రెస్ నేత‌ల‌పై కేసులు కూడా పెడుతోంద‌ని. వారిని వదిలే ప్ర‌స‌క్తేలేదు అని చుర‌క‌లు అంటించారు రేవంత్ రెడ్డి.