కాంగ్రెస్‌ నేత సంచలన వ్యాఖ్యలు కేటీఆర్ కౌంట‌ర్ ట్వీట్

259

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు తెలంగాణ‌లో ఎన్నికల వేడి రాజుకుంది ఓ ప‌క్క కూట‌మి ప్ర‌చారం మ‌రో ప‌క్క టీఆర్ ఎస్ పార్టీ ప్ర‌చారం తెలంగాణ గ‌డ్డ‌పై ఎన్నిక‌ల హీట్ ని పుట్టిస్తున్నాయి. నేను సీనియర్‌ రౌడీషీటర్‌.. నాకే టికెట్‌ ఇవ్వాలి’అని ఓ కాంగ్రెస్‌ నేత చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. అయితే ఈ విషయాన్ని ఓ అభిమాని ట్విటర్‌లో మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకురాగా.. మన కర్మరా! బాబు అనే ఎమోజీతో ఆయన రిట్వీట్‌ చేశారు.

Image result for kcr

వ‌రంగ‌ల్ జిల్లాలో కాంగ్రెస్ నేత పాల‌కుర్తి అసెంబ్లీ టికెట్ ఆశిస్తున్న సుధీర్‌ రెడ్డి, మరో నేత రాఘవ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్య‌లు చేశారు…నేను నిజాయితీగా కాంగ్రెస్‌ పార్టీ కోసం పనిచేసినా. కాంగ్రెస్‌ పార్టీ కోసమే రౌడీ షీటర్‌గా ఉన్నా. కాబట్టి నాకే టికెట్‌ ఇవ్వాలి. సీనియర్‌ రౌడీ షీటర్‌ను నేనే. నిజాయితీగా కాంగ్రెస్‌ పార్టీ కోసం పనిచేసింది నేనే. రాఘవ రెడ్డి అనే వ్యక్తి కాంగ్రెస్‌ పార్టీకి ఎన్నడు సేవ చేయలేదు.’ అని సుధీర్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక రౌడీషీటర్ల‌కు కాంగ్రెస్ టికెట్ ఇస్తుందా అనేలా కాంగ్రెస్ పార్టీపై ఈవీడియో తెగ వైర‌ల్ అవుతోంది.