ఏపీ రాజధానిపై జగన్ సంచలన నిర్ణయం

739

ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా రాజధాని అమరావతి నిర్మాణం చుట్టూనే తిరుగుతున్నాయి… ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి రాజధానిని అమరావతి నుండి మారుస్తాడని, ఇటీవలే ఒక మీడియా సమావేశంలో బొత్స సత్యనారాయణ సంచలన వాఖ్యలు చేశారు. ఇది పెను వివాదానికి చర్చకు కారణం అయింది. తర్వాత ఆయన దీనిపై అదే స్టాండ్ లో ఉన్నారు. ఏపీ రాజధాని అమరావతి ప్రజల కోసం నిర్ణయం తీసుకోలేదన్నారు. అది కొందరి ప్రయోజనాల కోసమే నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. రాజధాని విషయంలో శివరామకృష్ణ కమిటీని కాదని.. నారాయణ కమిటీ ఆధారంగా నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. అమరావతిలో నిర్మాణ వ్యయం ఎక్కువ అవుతుందని గతంలోనే చెప్పామన్నారు. ఇప్పుడూ కూడా అదే చెబుతున్నట్లు స్పష్టం చేశారు. 8 లక్షల క్యూసెక్కుల వరద వస్తేనే రాజధాని మునిగిపోతే.. ఒకవేళ పదేళ్ల క్రితం వచ్చినట్లు మళ్లీ వరద వస్తే అమరావతి ఏమవుతుంది? అని ప్రశ్నించారు.

ఈ క్రింద వీడియో చూడండి

త్వరలో అమరావతిపై ఓ నిర్ణయం తీసుకుంటామన్న ఆయన వ్యాఖ్యలు ఏపీలో అలజడి సృష్టించాయి. దీనిపై విపక్షాలు మండిపడ్డాయి. అమరావతిపై ఏదో ఒకటి తేల్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే రాజధాని రైతులు కూడా పోరాటానికి సిద్ధపడుతున్నారు. విపక్షాల మద్దతు కూడబెడుతున్నారు. టిడిపి, బిజెపి, జనసేన అలాగే రూలింగ్ లో ఉన్న వైఎస్ఆర్సిపి ఈ వాఖ్యల విషయంలో తీవ్రమైన మాటల యుద్దాన్ని జరుపుకుంటున్నాయనే చెప్పాలి ప్రతీ నాయకుడు కూడా తన మాటే నెగ్గించుకోవాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు… కానీ ఇంతవరకు కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజధాని అమరావతి విషయంలో ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించలేదు. కానీ దీనికంతటికి కారణం జగన్మోహన్ రెడ్డి అని అందరు కూడా ఆడిపోసుకుంటున్నారు.

Image result for jagan

అయితే జగన్మోహన్ రెడ్డి గురువారం నాడు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో రాజధానికి సంబందించిన ఎక్స్పపర్ట్ లు అలాగే అఫీషియల్స్ తో కొద్దీ సేపు చర్చలు జరపనున్నారని సమాచారం. ఆతరువాత రాజధాని విషయంలో వచ్చిన వదంతులను, సందేహాలను అన్నింటిని క్లియర్ చేయాలనీ నిర్ణయం తీసుకున్నారట. దానికి తోడు సంబంధిత మంత్రులను, అధికారులందరిని కూడా ఈ మీటింగ్ కు హాజరు కావాలని జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారట. అయితే ఈ చర్చల విషయంలో అందరి సలహాలను చర్చించిన తరువాత రాజధాని విషయం ప్రకటించాలని జగన్ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. వైసీపీ నేతలు చర్చించుకునే దాని బట్టి జగన్ రాజధానిని మార్చే ఆలోచనలో ఉన్నారు అని వార్తలు అయితే వస్తున్నాయి.

Image result for jagan

సాయంత్రం 4.30కి రాజధాని నిర్మాణంపై సీఎం జగన్‌ సమీక్ష చేయనున్నారు. ముందుగా సీఆర్డీఏ అధికారులతో సీఎం చర్చించనున్నారు. ఈ సందర్భంగా మంత్రివర్గ ఉపసంఘం నివేదిక సమర్పించనున్నారు. సమావేశం అనంతరం రాజధానిపై సీఎం జగన్‌ స్పష్టతనిచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా జగన్ ఎలాంటి డెసిషన్ చెబుతారా అని ఎదురుచూస్తున్నారు రైతులకి మాత్రం ఈ విషయంలో చాలా బెంగగా కూడా ఉంది, అయితే టీడీపీ మాత్రం దీనిని అవకాశంగా మలచుకోవాలని చూస్తోంది. మరి మీ నిర్ణయం కూడా చెప్పండి, రాజధాని దొనకొండలో ఏర్పాటు చేస్తే మంచిది అని భావిస్తున్నారా, లేదా అమరావతిని కంటిన్యూ చేయడం బెటర్ అని భావిస్తున్నారా కామెంట్ల రూపంలో తెలియచేయండి.