ఏపీ రాజకీయాల్లో వేలు పెడ‌తాం బాబుకు కేటీఆర్ వార్నింగ్

312

తెలంగాణ ఎన్నిక‌ల తంత్రం ర‌స‌వ‌త్త‌రంగా మారింది.. మ‌రో నాలుగు రోజులు ప్ర‌చారానికి స‌మ‌యం ఉంది…ఈ స‌మ‌యంలో తెలంగాణ‌లో ఎన్నిక‌ల హీట్ మ‌రింత పెరిగింది. ఓ ప‌క్క భారీ బ‌హిరంగ‌స‌భ‌లు.. మ‌రో పక్క రోడ్ షోల‌తో ప్ర‌చారం హోరెత్తిస్తున్నారు.. ఈ స‌మ‌యంలో మంత్రి టీఆర్ ఎస్ నేత, కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు ..రాజకీయంగా చంద్రబాబు అంతుచూసేందుకు అవసరమయితే ఏపీలోనూ వేలుపెడతామని ప్రకటించారు.

Image result for chandra babu

చంద్రబాబు తెలంగాణ రాజకీయాల్లో అనవసరంగా వేలుపెట్టారన్నారు. నాలుగు బిల్డింగులు కట్టి చంద్రబాబే అంత ఫోజు కొడితే అసాధ్యమనుకున్న తెలంగాణను తెచ్చిన కేసీఆర్‌కు ఎంతుండాలని కేటీఆర్ ఎద్దేవా చేశారు. తాము కూడా ఏపీ రాజకీయాల్లో వేలుపెడతామని స్పష్టం చేశారు. రాజకీయంగా చంద్రబాబు సంగతి తేలుస్తామన్నారు. ఆ దిశగా భవిష్యత్తులో నిర్ణయం ఉంటుందన్నారు. ఇక కేటీఆర్ కామెంట్ల‌తో ఇటు తెలుగుదేశం నాయ‌కులు క ఊడా విమ‌ర్శ‌లు చేస్తున్నారు.