ఏపీ కేబినెట్ కీల‌క డెసిష‌న్స్

318

ఏపీ సీఎం చంద్ర‌బాబు అధ్య‌క్ష‌త‌న విజ‌య‌వాడ‌లో ఏపీ కేబినెట్ భేటీ జ‌రిగింది.. ఈ స‌మావేశంలో ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు . ఏపీ కేబినెట్ నిర్ణ‌యాలు ఇప్పుడు తెలుసుకుందాం.

కేంద్రం నెరవేర్చని హామీలను రాష్ట్రమే చేపట్టాలి
రాయలసీమ స్టీల్ కార్పొరేషన్ ఏర్పాటుకు కేబినెట్‌ నిర్ణయం
నెల రోజుల్లో కడప స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన..
ప్రైవేట్ సంస్థలతో కలిసి ప్రభుత్వ జాయింట్ వెంచర్ దిశగా ప్రయత్నాలు.
పీపీపీ మోడల్‌లో వైజాగ్‌ మెట్రో చేపట్టాలని నిర్ణయం
రూ. 8,300 కోట్లతో 42 కిలోమీటర్ల మేర వైజాగ్ మెట్రో
ప్రపంచంలోనే పీపీపీ మోడల్‌లో నిర్మితమవుతున్న… రెండో అతి పెద్ద మెట్రో రైల్ ప్రాజెక్టు వైజాగ్ మెట్రో, 4,200 కోట్ల రుణం ఇచ్చేందుకు కొరియా ప్రభుత్వం ముందుకొచ్చింది.
గాజువాక-కొమ్మాది- 30 కి.మీ, గురుద్వారా- ఓల్డ్ పోస్టాఫీసు-5.25 కి.మీ..
తాటిచెట్లపాలెం- వాల్తేరు మధ్య 6.5 కి.మీ మెట్రో రైలు
అన్న క్యాంటీన్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ ఏర్పాటు
గ్రామీణ ప్రాంతాల్లో 152 అన్న క్యాంటీన్ల ఏర్పాటు
రాష్ట్ర వ్యాప్తంగా 367 అన్న క్యాంటిన్లు ఏర్పాటు
మున్సిపాలిటీలో 215, గ్రామీణ ప్రాంతాల్లో 152 క్యాంటిన్లు ఏర్పాటు
వచ్చే జనవరి 31నాటికి గ్రామీణ ప్రాంతాలలో అన్న క్యాంటిన్లు ఏర్పాటు చేయాలని ఆమోదం తెలుపుతూ కేబినెట్ నిర్ణయాలు తీసుకుంది. కాగా రామాయపట్నం పోర్ట్ ఏర్పాటుపైనా కేబినెట్‌లో చర్చ జరిగింది.