ఏపీకి మరోసారి తెలంగాణ ముఖ్యమంత్రి

251

ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి ఏపీకి వెళ్లనున్నారు. ఆయన రాజకీయ పర్యటన కోసం రావడం లేదు అని తెలుస్తోంది..వచ్చేనెల 10న విశాఖలో శారదాపీఠం వార్షికోత్సవాల్లో కేసీఆర్ పాల్గొననున్నారు. ఈ మేరకు అధికారులు కూడా ఈ కార్యక్రమం గురించి ఒకే అని చెప్పారట..ఫిబ్రవరి 10 నుంచి 14 వరకు విశాఖ శారదా పీఠం వార్షికోత్సవాలు జరుగనున్నాయి. ఈ క్రమంలో వచ్చేనెల 14న జరిగే పూర్ణాహుతి కార్యక్రమానికి కేసీఆర్ హాజరుకానున్నారు. ఇటీవల ఎర్రవల్లిలో ఐదురోజుల పాటు సహస్ర చండీ యాగాన్ని కేసీఆర్ నిర్వహించారు. శారదాపీఠాధిపతి స్వరూపానంద స్వామి యాగానికి హాజరయ్యారు.

Image result for kcr
ఆయన ఆధ్వర్యంలోనే పూర్ణాహుతి కార్యక్రమం జరిగింది. ఆ సమయంలో శారదాపీఠం వార్షికోత్సవాలకు రావాల్సిందిగా కేసీఆర్ను స్వరూపానంద స్వామి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే వచ్చేనెల 14న సీఎం కేసీఆర్ విశాఖ వెళ్లి శారదా పీఠాన్ని సందర్శించనున్నారు. అక్కడ జరిగే అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపనలో కేసీఆర్ కుటుంబసభ్యులతో కలిసి పాల్గొంటారు. ప్రత్యేక పూజలు కూడా నిర్వహించనున్నారు. డిసెంబర్ నెలలో ఫెడరల్ ఫ్రెంట్కు సంబంధించి టూర్కు బయలుదేరిన సమయంలో మొదటగా కేసీఆర్ విశాఖ శారదాపీఠాన్ని సందర్శించిన విషయం తెలిసిందే…ఇక కేసీఆర్ మళ్లీ ఏపికి రానుండటంతో ఆయనని మరింత అభిమానులు కలుసుకునేందుకు వస్తారు అని, అలాగే ఇక్కడ ఆ రోజు ప్రజలతో ముచ్చటిస్తే బాగుంటుంది అని కోరుకుంటున్నారు ప్రజలు.