ఏపి బంద్…వైసిపి నేతల అరెస్ట్..

459

ప్రత్యేక హోదా నినాదంతో ఏపి ప్రతిపక్ష నాయకుడు వైకాపా అధ్యక్షుడు వై ఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు రాష్ట్రమంతటా బంద్ పాటిస్తున్నారు..వైసిపి శ్రేణులు బంద్ లో ఉత్సాహంగా పాల్గొంటున్నాయి..ఈరోజు ఉదయం నుంచే పార్టీ కార్యకర్తలు రోడ్లపై బైఠాయించారు…బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు..అలాగే షాపులు కూడా మూయించారు..కొన్ని జిల్లాల్లో పార్టీ కార్యకర్తలు భారీ ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు చేపట్టగా.. అక్కడక్కడా రోడ్లపై బైఠాయించి ఆందోళనలు చేస్తున్నారు…

విజయవాడలో వైసీపీ నేతలు బస్సుల్ని అడ్డుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. ఆ పార్టీ నేతలు మల్లాది విష్ణు, పార్థసారధిలు డిపో ముందు బైఠాయించగా పోలీసులు అరెస్ట్ చేశారు. బెజవాడ మాత్రమే కాకుండా కృష్ణా జిల్లావ్యాప్తంగా వైసీపీ ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. గుంటూరు జిల్లాల్లో కూడా బంద్ కొనసాగుతోంది.

చిలకలూరిపేటలో వైసీపీ నేత మర్రి రాజశేఖర్‌ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. సత్తెనపల్లిలో అంబటి రాంబాబు.. నర్సరావుపేటలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌ రెడ్డిలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒక్క కృష్ణా జిల్లాలో మాత్రమె కాకుండా అన్ని జిల్లాలో కూడా బ్యాండ్ పాటిస్తున్న వైకాపా నాయకులు కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసారు..

అరెస్ట్‌లపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. పోలీసుల తీరుపై వైసీపీ నేతలు కూడా మండిపడుతున్నారు. రాష్ట్రానికి హోదా సాధన కోసం పోరాటం చేస్తుంటే.. ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్నారు. బంద్‌కు టీడీపీ కూడా మద్దతు తెలపాల్సింది పోయి.. ఇలా పోలీసుల సాయంతో అడ్డుకోవడం దారుణమంటున్నారు. అరెస్ట్ చేసిన వైసీపీ నేతల్ని వెంటనే విడుదల చేయాలంటూ.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వైసీపీ బంద్ పిలుపుతో విద్యాసంస్థలకు ముందుగానే సెలవులు ప్రకటించారు. ఇవాళ జరగాల్సిన పరీక్షలు కూడా వాయిదా వేశారు. దుకాణ సముదాయాలు కూడా స్వచ్ఛందంగా మూతపడ్డాయి.