ఎంపీ జేసి దివాక‌ర్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

519

అనంత‌పురం ఎంపీగా ఉన్న జేసి దివాక‌ర్ రెడ్డి ఏమి చేసినా సంచ‌ల‌నం అనేచెప్పాలి..తెలుగుదేశం అధినేత చంద్రబాబు కష్టపడుతున్నారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు తాపత్రయపడుతున్నారు. రోజుకు 15 గంటలు ప్రజాసేవలోనే గుడుపుతున్నారు. ఆయన పట్ల ప్రజల్లో సానుభూతి ఉంది. ఆయన మాత్రమే ఈ రాష్ట్రాన్ని బాగు చేయగలరనే అభిప్రాయం ఉంది. కానీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉంది. అది కూడా కొంతమంది పైనే! తిరుమల ఉత్తరాలకు కూడా డబ్బు తీసుకునేవారితోనే అసలు సమస్య అంతా! కొంతమంది అయితే రేట్లు కూడా పెట్టారు. నేను ఈ విషయాలన్నీ సీఎంకు చెప్పాను..” అని తాజాగా తన మనసులో మాట బయటపెట్టారు అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి.

Image result for జేసి దివాక‌ర్ రెడ్డి

ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను పోటీ చేయ‌ను త‌న త‌మ్ముడు కూడా పోటీ చేయ‌డు అని త‌న కుమారుడు ఎంపీగా త‌న త‌మ్ముడు కొడుకు అస్మిత్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు అని తెలియ‌చేశారు ఆయ‌న‌. ఇక అనంతలో ఏడుగురికి టిక్కెట్లు ఇవ్వ‌కూడ‌దు అని వారిస్ధానంలో కొత్త‌వారికి ఇవ్వాలి అని జేసి బాబుకు తెలియ‌చేశారు మ‌రి సీఎం దీనిపై ఎటువంటి నిర్ణ‌యం తీసుకుంటారో చూడాలి.