ఎంపీగా బాలయ్య చిన్న అల్లుడు

188

ఇప్పటికే బాలయ్య ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన పెద్ద అల్లుడు సీఎం నారా చంద్రబాబు నాయుడి కుమారుడు లోకేష్ మంత్రిగా ఉన్నారు. ఇక మరో అల్లుడ్ని కూడా రాజకీయాల్లోకి తీసుకురావాలి అని సంకల్పించారట బాలయ్య.. రాజకీయాల్లో వారసులు రావడం కామన్, ఇక ఇదే మంచి సమయం అని భావించిన బాలయ్య తన చిన్న అల్లుడ్ని కూడా ఎంపీగా పోటీ చేయించాలి అని చూస్తున్నారట.

Image result for బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీభరత్

నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీభరత్. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో విశాఖపట్నం నుంచి ఎంపీగా పోటీపడబోతున్నట్లు ఇటీవలే వెల్లడించడం వైజాగ్ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది…శ్రీభరత్ గీతం విద్యాసంస్థల ఛైర్మన్, టీడీపీ ఫార్మర్ ఎమ్మెల్సీ డా.ఎంవీవీఎస్ మూర్తి మనవడు. ఇక దురదృష్టవశాత్తు ఎమ్మెల్సీ డా.ఎంవీవీఎస్ మూర్తి ఇటీవల మరణించడంతో రాజకీయంగా ఆయన మనవడి ఎంట్రీని చూడలేకపోయారు, మరి బాలయ్య మాత్రం తన చిన్న అల్లుడు భరత్ కు ఈసారి ఎంపీ టికెట్ ఇవ్వాలి అని బాబు దగ్గర విశ్వప్రయత్నం చేస్తున్నారట చూడాలి మరి టికెట్ సాధిస్తోరో లేదో.