ఎంపీగా కాదు ఎమ్మెల్యేగా పోటీ చేస్తా బాబు కోటరీలో కీలక వ్యక్తి

230

నెల్లూరు జిల్లా టీడీపీలో కొందరి మధ్య వార్ జరుగుతోంది అని వార్తలు ఈ మధ్య వినిపిస్తున్నాయి.. టిక్కెట్ల విషయంలో నాయకుల మధ్య అసంతృప్తి వస్తోంది అని చెబుతున్నారు. తాజాగా కావలి నియోజకవర్గం నుంచే టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తానని.. తనకు ఎంపీగా పోయే ఆలోచన లేదని సీఆర్డీఏ సభ్యుడు బీద మస్తాన్రావు స్పష్టం చేశారు. ఆయన టీడీపీలో సీనియర్ లీడర్, బాబుకి కూడా బాగా కావలసిన వ్యక్తి. ఆయన కావలిలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా ఓటమి చెందినా నియోజకవర్గం అభివృద్ధికోసం కోట్లాది రూపాయలు నిధులు తెచ్చి కావలిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానన్నారు.

Image result for బీద మస్తాన్రావు
తాను ఎక్కడ అయితే పొగొట్టుకున్నానో అక్కడ వెతుక్కుంటాను అని … గత ఎన్నికల్లో కావలిలో ఓటమి చెందినా తిరిగి కావలి అభివృద్ధికి కృషి చేశానని ఎమ్మెల్యేగానే పోటీచేసి ఓడినచోటే విజయం సాధించి ముందుకు పోతానన్నారు… తనను అభిమానించే వేలాదిమంది ప్రజలను నిరాశ పెట్టదలుచుకోలేదని, తాను ఎంపీగా పోతానన్నది కేవలం ప్రచారం మాత్రమే అన్నారు… అయితే బీసీ సామాజిక వర్గం ఎక్కువగా ఉండటంతో ఆయనకు బాబు ఇక్కడ నుంచి ఎంపీగా టికెట్ ఇస్తాను అని అంటున్నారట.