ఎంట్రీ అదిరిపోయింది కేటీఆర్ కు శుభాకాంక్ష‌లు

393

తెలంగాణ‌లో టీఆర్ఎస్ పార్టీ తిరుగులేని శ‌క్తిగా రెండోసారి అధికారంలోకి రావ‌డంతో , మ‌రోసారి కాంగ్రెస్ పార్టీకి ఫుల్ క్లారిటీ అయితే వ‌చ్చింది..ఇక టీఆర్ఎస్ పార్టీకి వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ని నియ‌మించారు ఆపార్టీ అధ్య‌క్షులు కేసీఆర్. తాజాగా నేడు ఆయ‌న ఆ బాధ్య‌త‌లు చేప‌ట్టారు.
టీఆర్‌ఎస్‌ అంటే తిరుగులేని రాజకీయశక్తి అని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ అన్నారు. సోమవారం ఉదయం వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన త‌ర్వాత కేటీఆర్ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ తనకు అప్పగించిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తానని తెలిపారు.

Image result for ktr

పార్టీని వందేళ్లపాటు తిరుగులేని శక్తిగా ఉండేలా తీర్చిదిద్దుతానని స్పష్టం చేశారు. తమలో ఒకడిగా ఉంటూ పార్టీని బలోపేతం చేస్తానని ఆయన చెప్పుకొచ్చారు. అందరినీ కలుపుకుని ముందుకెళ్తానన్న కేటీఆర్ కార్యకర్తలు, అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక యంగ్ లీడ‌ర్ కు పార్టీ బాధ్య‌త‌లురావ‌డంతో కేడ‌ర్ అంతా జోష్ లోఉన్నారు.