ఉండవల్లి మీటింగ్ లో కీలక అంశాలు

182

రాష్ట్రానికి జరిగిన అవమానాల్ని మర్చిపోకూడదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్ అన్నారు… ఏపీకి జరిగిన అన్యాయం మర్చిపోతే మనకు అభివృ్ద్ది జరుగదు అని ఆయన తెలియచేశారు… మనకు దెబ్బతగిలినప్పుడు ప్రతిస్పందించాలని చెప్పారు. ప్రతిస్పందించకపోతే సమస్యలు పరిష్కారం కావని తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్ను తప్పుపట్టడం కాదని.. వ్యవస్థలో ఏం జరిగినా రాజ్యాంగబద్ధంగా జరగాలన్నారు. భారత రాజ్యాంగం ఏర్పడ్డాక ఏ విభజన ఇలా జరగలేదన్నారు. ఎన్నికల్లో ఏ పార్టీ అయినా గెలవవచ్చు కానీ… రాష్ట్ర ప్రయోజనాల కోసం అందరం కలిసి పోరాడాలని కోరారు.. మాజీ ఎంపీ ఉండవల్లి ఏర్పాటు చేసిన రౌండ్టేబుల్ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు అన్ని పార్టీల నేతలు.