ఈ నెల 11 నుంచి జనవరి 8 వ‌ర‌కూ పార్ల‌మెంట్ లో వాడి వేడి చ‌ర్చ‌

298

ఇక ఐదు రాష్ట్రాల ఎన్నిక‌లు అయిపోవ‌డంతో ఈ నెల 11 నుంచి పార్ల‌మెంట్ శీతాకాల స‌మావేశాలు జ‌రుగ‌నున్నాయి. ఇప్ప‌టికే పార్లమెంటు శీతాకాల సమావేశాల నేపథ్యంలో బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఈరోజు అఖిలపక్షాలతో సమావేశం నిర్వహించింది.ఈ ప్ర‌ధాన స‌మావేశం పార్లమెంట ఆవరణంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగింది. కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో పాటు కాంగ్రెస్ నేతలు గులాం నబీ ఆజాద్, మల్లికార్జున్ ఖర్గే, సీపీఐ నేత డి. రాజా సహా ప్రతిపక్ష పార్టీలకు చెందిన పలువురు నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Image result for modi

ఈ నెల 11 నుంచి జనవరి 8 వరకు జరగనున్న పార్లమెంటు శీతాకాల సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని కోరుతూ కేంద్రం ఈ సమావేశం నిర్వహించింది. ఈ స‌మావేశానికి ప్ర‌తిప‌క్ష నేత‌లు అంద‌రూ పాల్గొన్నారు..వాస్తవానికి పార్లమెంటు సమావేశాలు నవంబర్‌లోనే ప్రారంభం కావాల్సి ఉండగా.. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, మిజోరం సహా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల కారణంగా ఆలస్యంగా ప్రారంభమవుతున్నాయి. రేపు ఐదు రాష్ట్రాల రిజ‌ల్ట్ తో పాటు పార్లమెంట్ సమావేశాలు కూడా ఉండ‌నున్నాయి.