ఈయనే నా తమ్ముడు లోకేష్ ప్రకటన

212

ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి నారాలోకేష్ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఈ సమయంలో తెలుగుదేశం నాయకులు అందరిని తన సోదరులుగా చెబుతున్నారు ఆయన. నాకు అక్కచెల్లెళ్లు లేరు.. సోదరులు లేరు.. నాకు ఉన్న ఏకైక సోదరుడు అమలాపురం టీడీపీ లోక్సభ అభ్యర్థిగా పోటీచేస్తున్న గంటి హరీష్మాధుర్’ అని టీడీపీ జాతీయప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ అమలాపురం ముమ్మిడివరం గేటు వద్ద జరిగిన బహిరంగసభలో ప్రకటించారు. హరీష్మాధుర్ గురించి మాట్లాడాలని సభికులు కోరినప్పుడు ఆయన పైవిధంగా స్పందించారు. ‘హరీష్తో ఏడాది నుంచి నాకు అనుబంధం ఉంది. టీడీపీ కార్యకలాపాల్లో హరీష్పాత్ర కూడా కీలకమే, బూత్ కన్వీనర్ వ్యవస్థను ఏర్పాటుచేయడంలో హరీషే కీలకం’అని లోకేష్ అన్నారు. ‘బాలయోగిని ఒకే ఒక్క సారి నేను కలిశాను, ఆయన ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించడానికి నిరంతరం కృషిచేసేవారు. మహావ్యక్తి బాలయోగి. ఈప్రాంత అభివృద్ధికి ఆయన ఎంతో శ్రమించారు. గోదావరులపై వారధులు నిర్మించారు, రహదారులు ఏర్పాటుచేశారు, మంచినీటి పథకాలు నెలకొల్పారు’ అంటూ బాలయోగి కృషిని గుర్తుకు తెచ్చుకుని ప్రశంసించారు.