ఈనెల 13 వ జనసేనాని కీలక ప్రకటన

265

రాజకీయ నాయకులు సంక్రాంతి పండుగ సమయంలో వారి సొంత ప్రాంతాల్లో ఉండటం తెలిసిందే.. ఇక వారి పార్టీ కేడర్ తో సంబరాల్లో పాల్గొంటారు అయితే ఈఏడాది జనసేనాని సంక్రాంతికి సరికొత్త పొలిటికల్ విషయం తెలియచేయనున్నారు… జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈనెల 13న తెనాలి రానున్నట్లు ఆ పార్టీ నాయకుడు నాదెండ్ల మనోహర్ తెలిపారు.

Image result for jenasena

సంక్రాంతిని పురస్కరించుకుని పెదరావూరులోని వ్యవసాయ క్షేత్రంలో జరిగే భోగి పండుగ వేడుకల్లో పాల్గొంటారని తెలిపారు. ఇందుకు సంబంధించి పెదరావూరు వ్యవసాయ క్షేత్రంలో చేయనున్న ఏర్పాట్లను సోమవారం కార్యకర్తలతో కలిసి పరిశీలించారు. రైతులు, మహిళలు యువతతో పవన్ భేటి అవుతారని రైతాంగ సమస్యలపై ఆయన కీలక ప్రకటన చేయనున్నారని మనోహర్ చెప్పారు.ఆయన వెంట పలువురు పార్టీ నాయకులు ఉన్నారు. ఇకగుంటూరులో ఈ ఏడాది పవన్ జనసేన కేడర్ తో అక్కడ కార్యక్రమాల్లో పాల్గొంటారు అని తెలుస్తోంది.