ఇంట్లో తుపాకి కాల్చి బయట దర్జాగా తిరుగుతున్నారు..బాలయ్య పై పవన్ ఘాటు వ్యాఖ్యలు..

586

జనసేన అధ్యక్షుడు సినీ నటుడు పవన్ కళ్యాణ్ మరో ప్రముఖ నటుడు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పై సంచలన వ్యాఖ్యలు చేసారు..ప్రస్తుతం పవన్ జనసేన పోరాట యాత్రలో భాగంగా పశ్చిమ గోదావరి జిలాలో పర్యటిస్తున్నారు..అయితే మంగళవారం కాలు బెణకడంతో భీమవరంలో పవన్‌ విశ్రాంతి తీసుకున్నారు.

అక్కడికి వచ్చిన వేలాది మంది అభిమానులతో ఆయన ముచ్చటించారు. తమను పోలీసులు ఇబ్బంది పెడ్తున్నారని, బైక్‌ సైలెన్సర్‌ తీసి శబ్ధం చేస్తే తప్పంటున్నారని ఈ సందర్భంగా అభిమానులు పవన్‌ దృష్టికి తీసుకొచ్చారు. తమ పార్టీ కార్యకర్తలు బైక్‌ సైలెన్సర్‌ తీసి శబ్ధం చేస్తే తప్పంటున్నారని, మరి ఇంట్లో తుపాకీతో కాల్చి బయట తిరుగుతున్నవారిని మాత్రం పట్టించుకోవడం లేదని ఆయన పరోక్షంగా బాలకృష్ణ ఇంట్లో కాల్పుల అంశాన్ని ప్రస్తావించారు.

2004లో బాలకృష్ణ తన ఇంట్లో నిర్మాత బెల్లంకొండ సురేశ్‌పై కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఇక రెండు రోజుల క్రితం టీడీపీ ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని, రైతుల భూములతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తుందని మండిపడ్డారు.