ఆరు సెగ్మెంట్ల పై టీడీపీ ఫోక‌స్

389

ఎన్నికలు సమీపిస్తున్న వేళ జన్మభూమి మా ఊరు కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇక వైసీపీ విమ‌ర్శ‌ల‌కు జ‌న‌సేన కౌంట‌ర్ల‌కు తెలుగుదేశం పార్టీ స‌రైన జ‌వాబు ఇచ్చేందుకు సిద్దం అవుతోంది..జనవరి 2 నుంచి 11వ తేదీ వరకు జన్మభూమి – మా ఊరు కార్యక్రమం నిర్వహణకు షెడ్యూల్‌ ఖరారు చేసింది. ముఖ్యంగా గుంటూరు జిల్లాలో 17 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 1,444 గ్రామ సభలు నిర్వహించనుంది. ప్రతి పంచాయతీ, మున్సిపాలిటీలు, గుంటూరు నగరపాలక సంస్థలోని ప్రతి వార్డులో జన్మభూమి సభలు నిర్వహించనున్నారు.

Image result for tdp

జిల్లాలో వైసీపీ ప్రాతినిధ్యం వహిస్తున్న మాచర్ల, నరసరావుపేట, బాపట్ల, గుంటూరు తూర్పు, మంగళగిరి, నియోజకవర్గాలతో పాటు తాజాగా ప్రత్తిపాడు నియోజకవర్గానికి జన్మభూమి కార్యక్రమ పర్యవేక్షణకు ప్రొటోకాల్‌ ఇన్‌చార్జిల పేరుతో ఎమ్మెల్సీలు, కార్పొరేషన్‌ చైౖర్మన్‌లను నియమించనున్నారు…వచ్చేనెల 2 నుంచి 11 వరకు జరిగే జన్మభూమి కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లాలో ఏదో ఒక ప్రాంతంలో గ్రామ సభల్లో పాల్గొంటారని అధికారులు తెలిపారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో సీఎం గ్రామ సభలో పాల్గొనే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. మొత్తానికి వైసీపీ సెగ్మెంట్ల‌పై ప్ర‌త్యేక దృష్టి పెట్ట‌డంతో ఇప్పుడు అంద‌రూ ఇదే విష‌యం పై జిల్లాలో చ‌ర్చించుకుంటున్నారు.