ఆయన ప్రాణ బిక్షవల్ల బ్రతికా – చంద్రబాబు

305

సీఎం చంద్రబాబు తిరుమల వెంకన్న గురించి మాట్లాడారు.. స్వామిపై తనకు ఎంత భక్తి ఉందో తెలియచేశారు.. ఎటువంటి శుభకార్యం ఆయన ఇంట జరిగినా తిరుమలలో ఆశీర్వాదం స్వామి దర్శనం తీసుకోవడం వారి కుటుంబానికి అలవాటు.. ఇప్పుడు స్వామి గురించి ఆయన చెప్పడం అందరిని ఆకట్టుకుంది.అయితే ఇది కూడా ఓ దైవ కార్యక్రమ సమయంలో చేశారు బాబు.

Related image

రాజధాని నగరంలో వెంకటేశుడి ఆలయ నిర్మాణానికి సంబంధించి భూకర్షణ పనులు గురువారం జరిగాయి. సీఎం చంద్రాబు చేతుల మీదుగా పనులు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘మనల్ని ఆశీర్వదించడానికి శ్రీవారు అమరావతికి వచ్చారు. ఆయన మా కులదైవం. ఆయన పాదాల దగ్గర పుట్టాను. ఆయన నాకు పునర్జన్మ ఇచ్చారు. 2003లో అలిపిరిలో జరిగిన అతిపెద్ద ప్రమాదంలో బతికి బయటపడతానని ఎవరూ ఊహించి ఉండరు. అలాంటి ప్రమాదం నుంచి నన్ను రక్షించారు. వెంకటేశ్వర స్వామి నాకు ప్రాణభిక్ష పెట్టారు. అని తెలియచేశారు సీఎం చంద్రబాబు.25 ఎకరాల్లో దేవాలయాన్ని నిర్మిస్తున్నాం. వెంకటేశ్వరస్వామి ఆశీస్సులు ఉండాలనే తలంపుతో … ఉచితంగా టీటీడీకి భూమి ఇస్తున్నాం. నేను కానీ, పార్టీ వ్యవస్థాపకులు దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కానీ.. వెంకటేశ్వరుని సేవలో సాంప్రదాయబద్ధంగా, నియమనిబద్ధలతో ఉన్నాం.అని తెలియచేశారు.. సుమారు 140 కోట్లతో ఇక్కడ వెంకన్న ఆలయం నిర్మిస్తున్నారు.